పద్ధతి మార్చుకోమంటూ యజమాని హెచ్చరిక.. నిద్రపోతున్న సమయంలో వారి గదిలోకి వెళ్లిన వంట మనిషి.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-09T01:40:35+05:30 IST

చిన్న చిన్న సమస్యలను కొందరు చాలా సీరియస్‌గా తీసుకుని.. చివరకు దారుణాలకు తెగబడుతుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. జార్ఖండ్‌లో ఓ వ్యక్తి చిన్న..

పద్ధతి మార్చుకోమంటూ యజమాని హెచ్చరిక.. నిద్రపోతున్న సమయంలో వారి గదిలోకి వెళ్లిన వంట మనిషి.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

చిన్న చిన్న సమస్యలను కొందరు చాలా సీరియస్‌గా తీసుకుని.. చివరకు దారుణాలకు తెగబడుతుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. జార్ఖండ్‌లో ఓ వ్యక్తి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, చివరకు దారుణానికి పాల్పడ్డాడు. భోజనం చేసే విషయంలో పద్ధతి మార్చుకోవాంటూ యజమాని హెచ్చరించాడు. దీన్ని అవమానకరంగా భావించిన వంటమనిషి చివరకు ఓ రోజు.. యజమానులు నిద్రపోతుండగా గదిలోకి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 


జార్ఖండ్‌ (Jharkhand) గుమ్లా జిల్లా రైడిహ్ పరిధి మజ్‌గావ్ జామ్‌తోలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిచర్డ్‌, మెలెనీ మింజ్‌ దంపతులు.. కూతురు, కొడుకుతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. సత్యేంద్ర లక్రా అనే వ్యక్తి వీరి ఇంట్లో కొంతకాలంగా వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల భోజం చేసే విషయంలో పద్ధతి మార్చుకోవాలంటూ సత్యేంద్రను రిచర్డ్ మందలించాడు. దీంతో అప్పటినుంచి యజమానిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా దంపతులిద్దరినీ అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం వేచి చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నిద్రిస్తున్న యజమానుల గదిలోకి వెళ్లాడు.

పదే పదే అదే మాట అంటుండడంతో ఆగ్రహించిన కోడలు.. అత్త వేళ్లను కొరికేయడమే కాకుండా భర్త అని కూడా చూడకుండా..


గొడ్డలితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. రిచర్డ్‌, మెలెనీ మింజ్‌‌ను హత్య చేసిన అనంతరం వారి కుమార్తెపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే రిచర్డ్ కొడుకు మాత్రం అతడి బారి నుంచి తప్పించుకోగలిగాడు. స్థానికులు సత్యేంద్రను బంధించి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. రిచర్డ్, మెలెనీ మింజ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. రిచర్డ్‌, మెలెనీ మింజ్‌ దంపతుల మృతితో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. 

‘నా ఇష్టపూర్వకంగానే ఇతడిని పెళ్లి చేసుకున్నాను. ప్లీజ్.. దయచేసి మమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టకండి..’Read more