పూల దండ విషయంలో గొడవ.. చివరకు ఈ పెళ్లికూతురు చేసిన పని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు..

ABN , First Publish Date - 2022-01-30T01:53:44+05:30 IST

కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలు చూపుతూ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం. అలాంటప్పుడు, వీళ్లకేమన్నా పిచ్చా.. అని అనిపిస్తూ ఉంటుంది. కొందరి ప్రవర్తన అలా ఉంటుంది మరి. అలాంటి విచిత్ర ఘటనే..

పూల దండ విషయంలో గొడవ.. చివరకు ఈ పెళ్లికూతురు చేసిన పని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు..
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలు చూపుతూ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం. అలాంటప్పుడు, వీళ్లకేమన్నా పిచ్చా.. అని అనిపిస్తూ ఉంటుంది. కొందరి ప్రవర్తన అలా ఉంటుంది మరి. అలాంటి విచిత్ర ఘటనే ఉత్తరప్రదేశ్ ఔరయ్యా జిల్లాలో జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా వధూవరులు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కట్నం తదితర విషయాల్లోనూ ఎలాంటి సమస్యలూ లేదు. ఇంకేముందీ, పెళ్లికి అన్నీ సిద్ధం చేశారు. భారీగా ఖర్చు చేసి మండపంలో ఏర్పాట్లు చేశారు. పెళ్లి మండపంపై అంతా సందడి సందడిగా ఉంది. తీరా పూల దండలు మార్చుకునే విషయంలో అసలు తంటా జరిగింది. ఇందులో ఏం సమస్య ఉంటుందని అనుకుంటున్నారా.. మీరే చూడండి..


ఉత్తరప్రదేశ్‌ ఔరయ్యా జిల్లా బిదునా పోలీస్ సర్కిల్ పరిధిలోని నవీన్ బస్తీలో రెండు కుటుంబాల మధ్య పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది. యువతి, యువకుడికి ఒకరంటే ఒకరు నచ్చడంతో కట్న కానుకలు మాట్లాడుకుని పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల వారూ తమ బంధుమిత్రులందరికీ ఆహ్వానం అందించి, మండపంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ముహూర్త సమయం రానే వచ్చింది. వధూవరులిద్దరూ పెళ్లి వేదికపై సిద్ధంగా ఉన్నారు. ఈలోగా దండలు మార్చుకునే సమయం రానే వచ్చింది. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేసింది. తర్వాత వరుడి వంతు వచ్చింది. అయితే అతను మాత్రం మెడలో వేయకుండా వధువు మీదకు విసిరేశాడు. దీంతో వధువుకు కోపం కట్టలు తెంచుకుంది.

తీరా మూడు ముళ్లు వేశాక వధువు రివర్స్.. ఆ ఒక్క కారణం చూపి వద్దంటే వద్దంది.. చివరకు ఏమైందంటే..


‘‘దండను మెడలో వేయకుండా విసిరికొట్టి అందరిముందూ నన్ను అవమానిస్తావా’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ భీష్మించుకుంది. చాలా మంది పెద్దలు కలుగజేసుకుని వధువుకు నచ్చజెప్పారు. అయినా ఆమె మాత్రం పంతం వీడలేదు. చివరికి ఈ పంచాయితీ.. పోలీసుల వరకూ వెళ్లింది. వారు చెప్పినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పోలీసుల సమక్షంలో వధూవరుల కుటుంబీకులు వస్తువులు, నగదు, నగలను ఎవరివి వారు తీసుకున్నారు. చిన్న కారణానికే పెళ్లి రద్దు చేసుకున్న ఈ ఘటన.. స్థానికంగా చర్చనీయాంశమైంది.

పేరుకు పెళ్లి కారు.. లోపల ఆడవాళ్లను ఎక్కించి.. వారు చేసిన పని తెలిస్తే అవాక్కవుతారు

Read more