ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న రంగు రంగుల స్కూటర్.. ఇంతకీ దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-06-20T02:44:45+05:30 IST

ప్రముఖ వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడైనా కాస్త విభిన్నంగా ఉండే వాహనాలను...

ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న రంగు రంగుల స్కూటర్.. ఇంతకీ దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా..

ప్రముఖ వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడైనా కాస్త విభిన్నంగా ఉండే వాహనాలను రూపొందించేవారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయనకు ఓ రంగు రంగుల బజాక్ చేతక్ స్కూటర్ ఎంతో ఆకట్టుకుందట. ఆయనకు నచ్చిందంటే అదేమీ కొత్త వాహనం అనుకునేరు.. చాలా పాత వాహనం. అయితే దాన్ని రీమోడలింగ్ చేసిన విధానం ఆయన్ను కట్టిపడేసింది. వెంటనే తన ట్విటర్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు.


పాత ICE వెర్షన్‌కు చెందిన బజాజ్ చేతక్ వాహనాన్ని.. దాని యజమాని తన అభిరుచికి తగ్గట్టుగా రీమోడలింగ్ చేసుకున్నాడు. ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడంతో పాటూ బైకు మొత్తం రంగు రంగుల పూసలు, చిన్న చిన్న అద్దాలు, వివిధ అలంకరణ వస్తువులతో అలంకరించాడు. అలాగే వాహనం చుట్టూ లైట్లు, ముందు భాగంలో డిజిటల్ వాచ్, హ్యాండిల్ మధ్యలో మొబైల్ ఫోన్, స్పీకర్లు ఏర్పాటు చేశాడు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 60 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని యజమాని తెలిపాడు. ఒక్కసారి చార్జ్ చేస్తే 90కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని చెప్పాడు. పెట్రోల్ పంపు వద్ద ఉన్న ఈ స్కూటర్ ఫోన్‌లో రాజేష్ ఖన్నా నటించిన 'దో రాస్తే'లోని 'చుప్ గయే సారే నజారే' పాట ప్లే అవుతుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

వీడేంట్రా.. అంత పెద్ద భవనం పైనుంచి ఇంత ఈజీగా దిగేశాడు.. ఇది రియలా.. లేక గ్రాఫిక్సా..


ఈ స్కూటర్ ఆనంద్ మహీంద్రాకు నచ్చేయడంతో.. "జీవితం మీరు కోరుకున్నంత రంగుల మరియు వినోదాత్మకంగా ఉంటుంది’’ అని పేర్కొంటూ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి బరాత్‌లో గుర్రాన్ని తలపిస్తోందంటూ ఒకరు, ఇలాంటి రంగు రంగుల స్కూటర్‌ను ఎప్పుడు చూడలేదంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆ బాలికపై కొండముచ్చుకు నిజంగా పగ ఉందా.. లేకపోతే ఇలా చేసిందేంటీ..!

Updated Date - 2022-06-20T02:44:45+05:30 IST