Viral Video: లాంగ్‌జంప్‌లో పోటీ పడ్డ గేదె, కుక్క.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా..

ABN , First Publish Date - 2022-02-07T00:18:32+05:30 IST

జంతువులకు సంబంధించిన వీడియోలు.. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. అందులోనూ కాస్త విభిన్నంగా ఉండే వీడియోలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం..

Viral Video: లాంగ్‌జంప్‌లో పోటీ పడ్డ గేదె, కుక్క.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా..

జంతువులకు సంబంధించిన వీడియోలు.. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. అందులోనూ కాస్త విభిన్నంగా ఉండే వీడియోలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కుక్కకు, గేదెకు లాంగ్‌జంప్ పోటీ జరుగుతుంది. అయితే అందులో ఎవరు విజేత అయ్యుంటారో ఒకసారి ఊహించండి. ఈ వీడియో అందరినీ ఆకట్టుకోవడంతో పాటూ ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది.


ఓ పెద్ద కాలువలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కాలువకు ఒక వైపు ఒడ్డున గేదె, కుక్క లాంగ్‌జంప్ చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. కాలువ అవతలి ఒడ్డు మీదకు జంప్ చేసేందుకు రెండూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంటాయి. రెడీ.. స్టార్ట్.. అన్నట్లుగా రెండూ ఒకేసారి జంప్ చేసేందుకు వేగంగా వెళ్తాయి. అయితే తీరా పైకి ఎగిరే ముందు కుక్క మాత్రం.. వామ్మో.. నావల్ల కాదు! అన్నట్లుగా అక్కడే ఆగిపోతుంది. అయితే గేదె మాత్రం అదే కాన్ఫిడెన్స్‌తో కాలువ అవతలి వడ్డుకు అవలీలగా జంప్ చేస్తుంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుధా రామన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతోంది. గేదె ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఖడ్గమృగాన్నే ముద్దు పెట్టుకున్న యువతి.. వామ్మో! ఈ యువతికి ఎంత ధైర్యమో..



Read more