ప్రేమికుడికి పెళ్లవడంతో అతడి సోదరుడిని ప్రేమించిన యువతి.. అతనూ ఊరు విడిచి వెళ్లడంతో.. మూడో వ్యక్తితో వివాహం.. చివరకు ఓ రోజు..

ABN , First Publish Date - 2022-08-27T21:42:39+05:30 IST

20ఏళ్ల ఆ యువతికి సమస్యలు ప్రేమ (love) రూపంలో వచ్చిపడ్డాయి. ఆనందంగా సాగుతున్న ఆమె జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అతడితో జీవితాంతం కలిసుందామని అనుకునే లోపే..

ప్రేమికుడికి పెళ్లవడంతో అతడి సోదరుడిని ప్రేమించిన యువతి.. అతనూ ఊరు విడిచి వెళ్లడంతో.. మూడో వ్యక్తితో వివాహం.. చివరకు ఓ రోజు..

20ఏళ్ల ఆ యువతికి సమస్యలు ప్రేమ (love) రూపంలో వచ్చిపడ్డాయి. ఆనందంగా సాగుతున్న ఆమె జీవితంలోకి ఓ వ్యక్తి వచ్చాడు. అతడితో జీవితాంతం కలిసుందామని అనుకునే లోపే.. కుటుంబ సభ్యులు ప్రియుడికి వివాహం (marriage) చేశారు. ఈ క్రమంలో ఆమెకు ప్రియుడు సోదరుడు పరిచమయ్యాడు. అయితే అతడు కూడా కొన్నాళ్లకు ఊరు విడిచి వెళ్లడంతో చివరకు కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేశారు. భర్తతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితం చివరకు ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) రాష్ట్రం బెగుసరాయ్‌లోని చఖమిద్ పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన లాలీ కుమారి (20) అనే యువతికి  స్థానిక ప్రాంతానికి చెందిన బిట్టు కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఇద్దరూ జీవితాంతం కలిసి జీవించాలని అనుకున్నారు. అయితే కొన్నాళ్లకు వీరి విషయం బిట్టు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో అతడికి వేరే యువతితో వివాహం చేశారు. ఈ విషయం తెలిసి ఆవేదనలో ఉన్న లాలీకుమారికి కొన్నాళ్లకు.. బిట్టుకు సోదరుడి వరుసైన కుమార్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమకు దారితీసింది. అయితే వీరి ప్రేమ విషయం కూడా కుమార్ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఇటీవల కుమార్‌ను.. బెంగళూరుకు పంపించారు.

Viral news: వెంటబడి మరీ యువతుల కాళ్లు పట్టుకున్న యువకులు.. కరుణించమంటూ వేడుకోలు.. విషయం తెలిసి అంతా నవ్వులే నవ్వులు..


చివరకు లాలీ కుమారి తల్లిదండ్రులు.. కుమార్తెకు ఇటీవల చఖమిద్ పంచాయతీ పరిధికి చెందిన యువకుడితో వివాహం చేశారు. ఈ విషయం బెంగళూరులో ఉన్న కుమార్‌కు తెలిసింది. దీంతో లాలీకుమారిపై పగ పెంచుకున్నాడు. ఆగస్టు 6వ తేదీన సొంతూరుకు వచ్చిన కుమార్.. తన సోదరుడు బిట్టును కలిశాడు. ఇద్దరూ కలిసి లాలీకుమారిని చంపేందుకు కుట్ర పన్నారు. రాత్రి లాలికుమారికి ఫోన్ చేసి, ముఖ్యమైన విషయం మాట్లాడాలంటూ గ్రామ పరిసరాల్లోకి రమ్మని పిలిచారు. లాలీకుమారి అక్కడి రాగానే అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కత్తితో ఆమెపై గొంతు కోసి హత్య చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితులను ఇటీవల అరెస్ట్ చేశారు.

పర్సు కొట్టేస్తూ దొరికిపోయిన కుర్రాడు.. చితకబాదాక ఎందుకీ పని చేశావని నిలదీస్తే అతడు చెప్పింది విని నివ్వెరపోయిన జనంRead more