పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. భర్త బతిమిలాడినా నో రెస్పాన్స్.. ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-02-23T21:39:28+05:30 IST

మధ్యప్రదేశ్‌‌లో ఓ కుటుంబంలో తలెత్తిన వివాదం చాలా దూరం వెళ్లింది. పెళ్లయిన మూడో రోజే నవ వధువు తన పుట్టింటికి వెళ్లింది. భర్త బతిమిలాడినా ఆమె నుంచి స్పందన లేదు. చివరకు నవ వధువు చెప్పింది విని అంతా అవాక్కయ్యారు..

పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. భర్త బతిమిలాడినా నో రెస్పాన్స్.. ఆమె చెప్పింది విని..
ప్రతీకాత్మక చిత్రం

దంపతుల మధ్య తరచూ వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. గొడవ జరిగినప్పుడు ఉండే కోపం.. కాసేపటికి చల్లారి వారి మధ్య అనుబంధం మరింత బలపడుతూ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు.. పాల పొంగుమీద నురగలా కాసేపటికి సర్దుమణుగుతుంటాయి. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చిన్న గొడవలు కాస్త పెద్దవి అవుతుంటాయి. చివరకు విడాకులు తీసుకునే వరకూ వెళ్తుంటాయి. మధ్యప్రదేశ్‌‌లో ఓ కుటుంబంలో తలెత్తిన వివాదం చాలా దూరం వెళ్లింది. పెళ్లయిన మూడో రోజే నవ వధువు తన పుట్టింటికి వెళ్లింది. భర్త బతిమిలాడినా ఆమె నుంచి స్పందన లేదు. చివరకు నవ వధువు చెప్పింది విని అంతా అవాక్కయ్యారు.


మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్‌ పరిధి బండాలో నివాసం ఉంటున్న నందుపాల్ అనే వ్యక్తికి, లవ్‌కుష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరౌలీ గ్రామంలో నివాసం ఉంటున్న రీనా పాల్‌‌కు 2021 ఏప్రిల్‌లో వివాహమైంది. మరుసటి రోజే దంపతులిద్దరూ హనీమూన్ వెళ్లారు. అయితే అదే రోజే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ‘‘నువ్వు అందంగా లేవు.. నా చదువుతో పోల్చుకున్నా నీ చదువు చాలా తక్కువ’’.. అంటూ భర్తతో అనడంతో గొడవ మొదలైంది. ‘‘ అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నావ్.. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావ్’’.. అంటూ భర్త సర్దిచెబుతున్నా ఆమె మాత్రం వినలేదు. పెళ్లయిన మరుసటి రోజు మొదలైన గొడవ.. మూడో రోజుకు ముదిరిపోయింది. చివరకు ఇలాంటి భర్త నాకొద్దంటూ నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది.

పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి.. చివరకు ప్రియుడితో కలిసి బంధువుల పెళ్లికి వెళ్లి ఇలా చేస్తుందనుకోలేదు..


పెళ్లయిన మూడు రోజే.. ఊహించని పరిణామం ఎదురవడంతో నందుపాల్‌ అవాక్కయ్యాడు. ‘‘ఒక్కసారిగా తల్లిదండ్రులను వదిలి రావడంతో, ఆ బాధలో ఇలా మాట్లాడుతోంది.. కొన్ని రోజులుంటే తిరిగి వస్తుందిలే’’.. అనుకుంటూ భర్త తనకు తాను సర్దిచెప్పుకొన్నాడు. కొన్నాళ్ల తర్వాత భార్యను తీసుకురావడానికి అత్తగారింటికి వెళ్లాడు. అయితే ఆమె మాత్రం తనకు ఇష్టం లేదంటూ మళ్లీ అదే మాట మొఖం ముందే చెప్పేసింది. ఈ క్రమంలో ఓ సారి భార్యను తీసుకురావడానికి వెళ్లడంతో అత్తమామలంతా కలిసి నందపాల్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో తన భార్యను తనకు అప్పగించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. వారు కూడా పట్టించుకోకపోవడంతో ఏకంగా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

వద్దంటున్నా భర్త బలవంతం.. కాళ్లు, చేతులు కట్టేసి మరీ పైశాచిక ప్రవర్తన.. చివరకు ఏం జరిగిందంటే..

Read more