భార్యకు వినూత్నంగా స్వాగతం.. పెళ్లయ్యాక మొదటిసారి అత్తారింట్లోకి ఆమె అడుగుపెడుతోంటే.. ఆ భర్త ఓ తుపాకీ తీసుకుని..

ABN , First Publish Date - 2022-05-20T21:09:15+05:30 IST

ఆ యువకుడికి మూడ్రోజుల క్రితం పెళ్లైంది.. పుట్టింటి నుంచి అత్తింటికి వస్తున్న భార్యకు అతను వినూత్నంగా స్వాగతం పలకాలనుకున్నాడు..

భార్యకు వినూత్నంగా స్వాగతం.. పెళ్లయ్యాక మొదటిసారి అత్తారింట్లోకి ఆమె అడుగుపెడుతోంటే.. ఆ భర్త ఓ తుపాకీ తీసుకుని..

ఆ యువకుడికి మూడ్రోజుల క్రితం పెళ్లైంది.. పుట్టింటి నుంచి అత్తింటికి వస్తున్న భార్యకు అతను వినూత్నంగా స్వాగతం పలకాలనుకున్నాడు.. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టే ముందు ఒక తుపాకీ తీసుకొచ్చి ఆమె చేత ఫైరింగ్ చేయించాడు.. ఆ ఘటనను వీడియో తీయించాడు.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.. ఆ వీడియో వైరల్ అయి పోలీసుల వరకు చేరడంతో అతడికి కష్టాలు మొదలయ్యాయి.. ఆ కొత్త జంటను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు సిద్ధమవుతున్నారు. 

ఇది కూడా చదవండి..

పెళ్లి వేదికపై ఓ ఫ్రెండ్ వింత నిర్వాకం.. మర్నాడే షాకింగ్ ట్విస్ట్.. భార్యతో హ్యాపీగా ఉండాల్సిన వరుడు కాస్తా జైల్లోకి..!


ఆగ్రాకు సమీపంలోని ఖండౌలీ గ్రామానికి చెందిన సోదీ అనే యువకుడికి మూడ్రోజుల క్రితం వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలిసారి తన ఇంటికి రాబోతున్న భార్యకు అతను వినూత్నంగా ఆహ్వానం పలకాలనుకున్నాడు. భార్య ఇంటి ముందుకు రాగానే ఒక తుపాకీ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టి ఫైరింగ్ చేయించాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ ఘటనను స్నేహితుడి చేత వీడియో తీయించాడు. 


ఆ వీడియోను స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయి స్థానిక పోలీసుల వరకు వెళ్లింది. వారు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కాల్పులు జరిపిన కొత్త జంటను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.  

Updated Date - 2022-05-20T21:09:15+05:30 IST