ఉమ్మి మీద పడితే మాత్రం.. మరీ ఇంత దారుణమా.. ఏకంగా ప్రైవేట్ భాగాన్ని..

ABN , First Publish Date - 2022-08-21T22:42:01+05:30 IST

కొందరు చిన్నప్పటి నుంచే నేరస్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వారు జల్సాలకు అలవాటు పడి.. వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. కొందరైతే, మరీ చిన్న చిన్న కారణాలకే హత్యలకు..

ఉమ్మి మీద పడితే మాత్రం.. మరీ ఇంత దారుణమా.. ఏకంగా ప్రైవేట్ భాగాన్ని..

కొందరు చిన్నప్పటి నుంచే నేరస్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వారు జల్సాలకు అలవాటు పడి.. వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. కొందరైతే, మరీ చిన్న చిన్న కారణాలకే హత్యలకు తెగబడుతుంటారు. బీహార్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి సరదాగా టీ తాగడానికి వెళ్లాడు. అనంతరం గుట్కా వేసుకుని ఉమ్మేశాడు. అయితే పక్కనున్న వ్యక్తి మీద పడడంతో సమస్య తలెత్తింది. నా మీదే ఉమ్మేస్తావా  అంటూ ఆగ్రహం చేశాడు. చివరకు యువకుడి ప్రైవేట్ భాగాన్ని కట్ చేశాడు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) రాష్ట్రం బంకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోఖారి పంచాయతీ గాధిమోహన్ పూర్‌లో లక్ష్మణ్ కుమార్ అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇదిలావుండగా, శుక్రవారం సాయంత్రం లక్ష్మణ్ కుమార్.. తన స్నేహితుడు పప్పూసింగ్‌తో కలిసి సరదాగా నది ఒడ్డుకు వెళ్లాడు. తర్వాత వర్షం మొదలవడంతో టీ తాగేందుకు మనోజ్‌సింగ్‌కు చెందిన హోటల్‌కి వెళ్లారు. అనంతరం గుట్కా తిని ఉమ్మేయడంతో మనోజ్‌సింగ్‌పై కాళ్లపై పడింది. ఈ విషయంలో లక్ష్మణ్ కుమార్, మనోజ్‌సింగ్‌ మధ్య గొడవ జరిగింది.

ఇష్టం లేదని చెబితే అర్థం చేసుకుంటాడులే అనుకుంది.. కానీ రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా..


వాగ్వాదం ఎక్కువవడంతో మనోజ్‌సింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరికొందరు స్నేహితులతో కలిసి లక్ష్మణ్ కుమార్‌పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పదునైన ఆయుధంతో ప్రైవేట్ భాగాన్ని కట్ చేశాడు. దీంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Wife's shocking plan: నా భర్తను చంపేశారా! అంటూ కిల్లర్లకు భార్య ఫోన్.. చంపేంత ధైర్యం లేక.. చివరకు భర్తతో కలిసి వారు ఆడిన డ్రామాతో..

Read more