-
-
Home » Prathyekam » Thai YouTube Star Nutty Allegedly Cheats Followers Of Rs 437 crores sgr spl-MRGS-Prathyekam
-
Thai YouTuber Cheating: అభిమానులను నిండా ముంచిన థాయ్‌లాండ్ యూట్యూబ్ స్టార్.. ఏకంగా రూ. 437 కోట్లకు కుచ్చుటోపీ
ABN , First Publish Date - 2022-08-31T23:51:57+05:30 IST
ఆ యువతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.. తన డ్యాన్స్‌లు, అందచందాలతో లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది.

ఆ యువతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.. తన డ్యాన్స్‌లు, అందచందాలతో లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది.. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువ వ్యాపారవేత్తల కోసం కోచింగ్ క్లాస్‌లు కూడా ప్రారంభించింది.. అంతేకాదు భారీగా లాభాలు వస్తాయని నమ్మించి తన ఫాలోవర్ల చేత పెట్టుబడులు పెట్టించింది.. లాభాల సంగతి పక్కన పెడితే చివరికి అసలు కూడా చెల్లించలేక చేతులెత్తేసింది.. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి..
Teacher beaten by students: లెక్కల్లో తక్కువ మార్కులు వేశారని మాస్టర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్
థాయ్‌లాండ్ (Thailand)కు చెందిన నత్తమోన్ ఖోంగోచక్ అనే యువతి తన డ్యాన్సుల ద్వారా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముద్దుగా నట్టి ((Thai YouTube Star Nutty) అని పిలుచుకునే ఈ బ్యూటీకి ప్రస్తుతం 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్‌గా ఎదిగి సంపాదన పెంచుకుంది. అది సరిపోదన్నట్టు విదేశీ మారకంలో పెట్టుబడి పెట్టాలని తన ఫాలోవర్లకూ సూచించింది. విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే 35 శాతం అధికంగా లాభాలు వస్తానని నమ్మించింది. దాంతో దాదాపు 6వేల మంది డబ్బులు పెట్టుబడి పెట్టారు. అయితే వారికి నట్టి మే నెలలో షాకింగ్ విషయం చెప్పింది.
బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తి గత మార్చి నుంచి తన ట్రేడింగ్‌ను ఖాతాను, నిధులను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఫాలోవర్స్‌ను మోసం చేయడం తన ఉద్ధేశ్యం కాదని త్వరలోనే వారి పెట్టుబడులు తిరిగి చెల్లిస్తానని పేర్కొంది. ఆమెను నమ్మి ఫాలోవర్లు పెట్టిన పెట్టుబడి సుమారు 55 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 437కోట్లు) అని సమాచారం. గత నెల రోజులుగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. దీంతో బాధితులు నట్టి తమను మోసం (YouTuber Cheating) చేసిందంటూ థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 102 మంది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.