Viral Video: ఏనుగు ముందు బాలిక నృత్య ప్రదర్శన.. గజరాజు ఆశీర్వదించిన తర్వాత ఏం చేసిందో చూడండి..
ABN , First Publish Date - 2022-12-31T19:17:35+05:30 IST
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను ఇతరులతో పంచుకుంటారు. తాజాగా ఓ బాలిక ఆలయంలో సాంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను ఇతరులతో పంచుకుంటారు. తాజాగా ఓ బాలిక ఆలయంలో సాంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కర్ణాటకలో (Karnataka) జరిగిన ఘటనకు సంబంధించిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
కత్తిల్ ప్రాంతంలోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలోని గజరాజు ముందు ఓ చిన్నారి నృత్య ప్రదర్శన ఇచ్చింది. గజరాజు ఆ చిన్నారి డాన్స్‌ను చూసి ఫిదా అయిపోయింది. ఆ బాలికను తన తొండంతో ఆశీర్వదించింది (Temple Elephant Blesses Dancer In Karnataka). అంతేకాదు స్వయంగా తను కూడా డాన్స్ చేసింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. న్యూఇయర్ సందర్భంగా ఆ గజరాజు అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు భావిస్తున్నానని ఆనంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.