Tollywood Box Office: ఇప్పుడు అంతా తెలుగు అమ్మాయిల హవా

ABN , First Publish Date - 2022-12-09T19:04:51+05:30 IST

ఈ వారం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పదికి పైగా చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అయితే అందులో ఏమి పెద్ద విశేషం ఏమిటి అనుకుంటున్నారా, చాలా కాలం తరువాత తెలుగు అమ్మాయిలు ఎక్కువగా వున్న సినిమాలు ఈ వారం విడుదల అయ్యాయి.

Tollywood Box Office: ఇప్పుడు అంతా తెలుగు అమ్మాయిల హవా
Priya Vadlamani

ఈ వారం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పదికి పైగా చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అయితే అందులో ఏమి పెద్ద విశేషం ఏమిటి అనుకుంటున్నారా, చాలా కాలం తరువాత తెలుగు అమ్మాయిలు ఎక్కువగా వున్న సినిమాలు ఈ వారం విడుదల అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఈ వారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అంతా తెలుగు అమ్మాయిలదే అని చెప్పొచ్చు. 'ముఖ చిత్రం' (Mukhachitram) సినిమాలో కథానాయికగా నటించిన ప్రియ వడ్లమాని (Priya Vadlamani) తెలుగు అమ్మాయే. ఆమె నట విశ్వరూపం చూపించింది అని అందరూ ఆమెని ప్రశంసిస్తున్నారు. చాలా కాలం తరువాత ఒక తెలుగు నటి ఇంతలా పేరు తెచ్చుకోవటం ఒక విధంగా టాలీవుడ్ మంచి మార్పు దిశగా వెళుతోంది అని చెప్పొచ్చు. ఇప్పుడున్న యువ దర్శకులు ఎక్కువగా తెలుగు అమ్మాయిలనే ప్రోత్సహించటం చాలా విశేషం అనే చెప్పుకోవాలి.

p-v2.jpg

ఇంక 'పంచతంత్రం' (Panchatantram) సినిమా చూస్తే అందులో నటించిన అయిదుగురు అమ్మాయిలు అంటే, స్వాతి (Swathi Reddy), దివ్య శ్రీపాద (Divya Sripada), శ్రీ విద్య (Sri Vidya), శివాత్మికా రాజశేఖర్ (Shivatmika Rajasekhar) అందరూ తెలుగు అమ్మాయిలే. సినిమా కథ ఎలా వున్నా, ఫలితం విషయం ఎలా వున్నా ఇందులో నటించిన తెలుగు అమ్మాయిలు అందరూ ముందు ముందు మంచి మంచి విజయాలు సాధిస్తారని ఆశిద్దాం. స్వాతి చాలా సినిమాలు చేసి ఇప్పటికే చాలా మంచి పేరు తెచ్చుకుంది, చాలా కాలం విరామం తీసుకొని ఈ సినిమా చేసింది.

swathireddy.jpg

అలాగే దివ్య శ్రీపాద కూడా చాలా సినిమాలు చేసింది కానీ ఇంకా ఆమెకి సరి అయినా గుర్తింపు ఇచ్చే పాత్ర మన దర్శకులు ఇవ్వలేదనే చెప్పాలి. మంచి నటి ఆమె. అలాగే శివాత్మికా రాజశేఖర్ కూడా రెండు మూడు సినిమాలు చేసి మంచి నటిగా గుర్తిపు తెచ్చుకుంది. వీళ్ళు అందరూ రానున్న రోజులల్లో పెద్ద పెద్ద సినిమాలు చేసి మళ్ళీ తెలుగు అమ్మాయిలకి మంచి రోజులు వచ్చాయని తెలియచెప్పాల్సి వుంది.

shivatmika.jpg

అది ఇప్పుడు చిత్రసీమ లో వుండే పెద్ద దర్శకులు, నిర్మాతలు మీద వుంది. తెలుగు అమ్మాయిలు లేరు లేరు అని వాళ్ళు చెప్పుకు వస్తూ వున్నారు ఇన్ని రోజులూ, ఇప్పుడు ఈ సినిమాల్లో చేస్తున్నారు, అందుకని వీళ్ళకి కూడా అవకాశాలు ఇస్తే తమ టాలెంట్ నిరూపించుకుంటారు అనటంలో సందేహం లేదు.

divya-sripada.jpg

గత వారం విడుదల అయిన 'హిట్ 2' సినిమాలో నటించిన కోమలి ప్రసాద్ కూడా తెలుగు అమ్మాయే. కోమలి ప్రసాద్ అందులో ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ వేసింది, అందరి ప్రశంసలు పొందింది కూడా. కోమలి పెర్ ఫెక్ట్ గా ఆ రోల్ కి ఫిట్ అయిందని, చాలా బాగా నటించిందని, మంచి టాలెంట్ వున్న అమ్మాయని కూడా అందరూ ప్రశంసిస్తున్నారు. కోమలి కి కూడా మంచి అవకాశాలు వస్తే ఆమె ఇంకా బాగా చేయగలను అని నిరూపించుకుంటుంది అనటంలో ఎట్టి సందేహం లేదు.

komalee.jpg

Updated Date - 2022-12-09T19:07:45+05:30 IST