-
-
Home » Prathyekam » Swedish company that makes vegan burgers that are said to taste like human flesh sgr spl-MRGS-Prathyekam
-
Vegan Burger: మానవ మాంసాన్ని రుచి చూడాలనుకుంటున్నారా? అయితే ఈ బర్గర్ తినాల్సిందే..
ABN , First Publish Date - 2022-07-06T21:29:11+05:30 IST
మీరు శాకాహారా? ఇప్పటివరకు మాంసం రుచి చూడలేదా? బాధపడకండి శాకాహారుల కోసం స్వీడన్‌కు చెందిన ఓ కంపెనీ కృత్రిమంగా ఓ బర్గర్ తయారు చేసింది.

మీరు శాకాహారా? ఇప్పటివరకు మాంసం రుచి చూడలేదా? బాధపడకండి.. శాకాహారుల కోసం స్వీడన్‌కు చెందిన ఓ కంపెనీ కృత్రిమంగా ఓ బర్గర్ తయారు చేసింది. దాని రుచి మనిషి మాంసాన్ని పోలి ఉంటుందట. ఈ బర్గర్‌ను సోయా, పుట్టగొడుగులు, గోధుమ ప్రోటీన్లతో పాటు మొక్కల నుంచి తీసిన కొవ్వు పదార్థాలతో తయారు చేశారట. స్వీడన్‌కు చెందిన Oumph సంస్థ ఈ వేగన్ బర్గర్‌ను తయారు చేసింది. మానవ మాంసాన్ని పోలి ఉండే మొక్కల ఆధారిత బర్గర్‌ను రూపొందించడం ప్రపంచంలో ఇదే మొదటి సారి అని సంస్థ పేర్కొంది.
ఇది కూడా చదవండి..
Beer వల్ల కిక్కు మాత్రమే కాదు.. బోలెడన్ని లాభాలు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన Portuguese University పరిశోధకులు
ఈ బర్గర్‌ను రూపొందించినందుకు ఓంఫ్ సంస్థ గత వారం జరిగిన కేన్స్ లయన్స్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో అవార్డును కూడా గెలుచుకుంది. సాంకేతికంగా, సృజనాత్మకంగా మరింత ముందుకు సాగడానికి ఈ అవార్డు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తుందని ఓంఫ్ సహ వ్యవస్థాపకుడు, కార్పొరేట్ చెఫ్ అండర్స్ లిండెన్ అన్నారు. `మొక్కను ఉపయోగించడం ద్వారా ఏ రకమైన ఆహారాన్ని అయినా సృష్టించడం సాధ్యమవుతుందని నిరూపించడంలో ఇది అంతిమ విజయం. ప్రజల ఆహార అలవాట్లను, అవగాహనలను సవాలు చేయాలని మేమెప్పుడూ అనుకుంటాం. కొన్ని సరిహద్దులను అధిగమించడానికి ఎప్పడూ సిద్ధంగా ఉంటామ`ని ఆయన అన్నారు.
కాగా, వేగన్ బర్గర్ పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇది చాలా సృజనాత్మకంగా ఉందని కొందరు భావించగా, మరికొందరు ఇది అసహ్యకరమైన ఆలోచన అన్నారు. `మీరు ఎప్పుడైనా తినడానికి ఆనందించే ఉత్తమ బర్గర్ ఇదే. నిజంగా రుచికరమైనద`ని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. `చాలా భయంకరంగా ఉంద`ని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.