కోచింగ్ తీసుకోకుండానే రూ.23 లక్షల ప్యాకేజీతో జాబ్.. చదువు పూర్తవకుండానే ఉద్యోగాన్ని సాధించిన ఈ యువతి కథ ఇదీ..

ABN , First Publish Date - 2022-05-21T18:36:36+05:30 IST

ఆమె కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తోంది.. తోటి విద్యార్థులందరూ కోచింగ్ సెంటర్ల వెంట పరుగెడుతుంటే ఆమె మాత్రం స్వంత ప్రతిభనే నమ్మకుంది..

కోచింగ్ తీసుకోకుండానే రూ.23 లక్షల ప్యాకేజీతో జాబ్.. చదువు పూర్తవకుండానే ఉద్యోగాన్ని సాధించిన ఈ యువతి కథ ఇదీ..

ఆమె కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తోంది.. తోటి విద్యార్థులందరూ కోచింగ్ సెంటర్ల వెంట పరుగెడుతుంటే ఆమె మాత్రం స్వంత ప్రతిభనే నమ్మకుంది.. ఏ కోచింగ్ సెంటర్‌లోనూ జాయిన్ కాలేదు.. స్వంతంగా ప్రిపేర్ అవుతూ ఎప్పటికప్పుడు తనను తాను అప్‌డేట్ చేసుకునేది.. దీంతో ఆమె చదువు కూడా పూర్తవకుండానే ఓ పెద్ద సంస్థలో కొలువు వెతుక్కుంటూ వచ్చింది.. ఏడాదికి రూ.23 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది.. దీంతో ఆమెను అభినందిస్తూ ముఖ్యమంత్రి ఓ లేఖ రాశారు. 

ఇది కూడా చదవండి..

ఏడాదికి రూ.15 లక్షల జీతాన్నిస్తున్న జాబ్‌కు రిజైన్ చేస్తే అంతా నవ్వారు.. ఇప్పుడు నెలకు రూ.15 లక్షల సంపాదన..!


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మోక్షా జైన్ ఇంకా చదువు పూర్తి చేయకుండానే ఆమెకు వాల్‌మార్ట్ సంస్థలో ఉద్యోగం దొరికింది. ఏడాదికి రూ.23 లక్షల జీతం. ఆమె ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించింది. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఆమెను అభినందిస్తూ ఓ లేఖ రాశారు. ఆత్మవిశ్వాసంతో మోక్ష సాధించిన విజయం అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. భోపాల్‌కు చెందిన మోక్షకు త్వరలోనే చెన్నైలో కాని, బెంగళూరులో కానీ పోస్టింగ్ రాబోతోంది. 


`కెరీర్‌లో ముందుకెళ్లాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం. మనకు ఏం కావాలన్నది ముందుగానే తెలుసుకోవాలి. నేను ఏ కోచింగ్ సెంటర్‌లోనూ జాయిన్ కాలేదు. కానీ, చదువుకుంటూనే కొన్ని సంస్థలో ఇంటెర్న్‌షిప్ చేశాను. ఎప్పటికప్పుడు నన్ను నేను అప్‌డేట్ చేసుకునేదాన్ని. మనం ఏం రంగంలో ఎదగాలనుకుంటున్నామో దానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాల`ని మోక్ష తెలిపింది.

Updated Date - 2022-05-21T18:36:36+05:30 IST