సెల్ఫీలతో కోట్లు సంపాదించిన విద్యార్థి.. మీరూ సంపాదించవచ్చు.. అదెలాగంటే..

ABN , First Publish Date - 2022-01-26T10:20:27+05:30 IST

సరదాగా తీసుకున్న సెల్ఫీలతో ఒక విద్యార్థికి అనుకోకుండా అదృష్టం వరించింది. అతడు ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. ఆ విద్యార్థి ఐదేళ్ల పాటు రోజుకో సెల్ఫీ తీసుకునేవాడు. ఇప్పుడా సెల్ఫీలే అతనకి కోట్లు తెచ్చిపెట్టాయి...

సెల్ఫీలతో కోట్లు సంపాదించిన విద్యార్థి.. మీరూ సంపాదించవచ్చు.. అదెలాగంటే..

సరదాగా తీసుకున్న సెల్ఫీలతో ఒక విద్యార్థికి అనుకోకుండా అదృష్టం వరించింది. అతడు ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. ఆ విద్యార్థి ఐదేళ్ల పాటు రోజుకో సెల్ఫీ తీసుకునేవాడు. ఇప్పుడా సెల్ఫీలే అతనకి కోట్లు తెచ్చిపెట్టాయి. వివరాల్లోకి వెళితే..


ఇండోనేషియా దేశ రాజధాని జకార్తా నగరంలో నివసించే సుల్తాన్ గుస్తాఫ్ అలీ గజాలీ(22) కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుకుంటున్నాడు. అతనికి రోజూ కంప్యూటర్ ముందు కూర్చొని ఒక సెల్ఫీ తీసుకునేవాడు. అలా ఐదేళ్లుగా చేసే వాడు. ఆ సమయంలో తన శరీరంలో వచ్చిన మార్పులని తెలిపేలా తన సెల్ఫీలను కలిసి ఒక టైం ల్యాప్స్ వీడియో చేద్దామనుకున్నాడు. కానీ అప్పుడే అతనికి ఎన్‌ఎఫ్‌టి గురించి తెలిసింది. ఎన్‌ఎఫ్‌టి(NFT- Non fungible token) వెబ్ సైట్లో ట్వీట్లు, పాటలు, వీడియోలు, ఫోటోలను డిజిటల్ రూపంలో కొనడం, విక్రయించడం జరుగుతుంది.


గజాలీ వెంటనే  ఎన్‌ఎఫ్‌టి వెబ్ సైట్లో అకౌంట్ ఓపెన్ చేసి  ‘Ghojali Everyday’ పేరుతో 933 సెల్ఫీలు అమ్మకానికి పెట్టాడు. ఒక్కో దాని ధర మూడు డాలర్లు అని పోస్ట్ పెట్టాడు. అక్కడ  అతడి సెల్ఫీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. జనవరి 21 కల్లా.. ఐదు వందల మందికి పైగా ఈ సెల్ఫీలు కొనుగోలు చేశారు. ఫలితంగా గజాలీ ఖాతాలో 384 ఎథెర్ కాయిన్స్ వచ్చాయి. ఎథెర్ అంటే బిట్ కాయిన్ లాంటి ఒక క్రిప్టో కరెన్సీ. 384  ఎథెర్ ల విలువ.. పది లక్షల డాలర్లకు పైగానే. అంటే దాదాపు 7.5 కోట్ల రూపాయలు.

Updated Date - 2022-01-26T10:20:27+05:30 IST