నాలుగేళ్లుగా హోటల్లో ఒకే గదిని బుక్ చేసుకున్న యువకుడు.. లోపలికి వెళ్లిన సిబ్బందికి ఊహించని షాక్.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-01T21:48:30+05:30 IST

ఓ హోటల్లో ఓ వ్యక్తి నాలుగేళ్లుగా ఒకే గదిని అద్దెకు తీసుకుంటూ ఉన్నాడు. అయితే అతడి ప్రవర్తన చూసి సిబ్బందికి ఎలాంటి అనుమానమూ రాలేదు. కానీ ఓ రోజు అతడి గదిని హోటల్ సిబ్బంది శుభ్రం చేస్తుండగా ఓ షాకింగ్ సీన్ కనిపించింది. అతడు భయంతో ..

నాలుగేళ్లుగా హోటల్లో ఒకే గదిని బుక్ చేసుకున్న యువకుడు.. లోపలికి వెళ్లిన సిబ్బందికి ఊహించని షాక్.. చివరకు ఏమైందంటే..
ప్రతీకాత్మక చిత్రం

నేరాలు రోజుకో రూపు మార్చుకుంటున్నాయి. నేరస్థులు ఒక్కోచోట ఒక్కో రకం నేరం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక బాలికలు, యువతులు, మహిళలపై జరిగే దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల హత్యలు, అత్యాచారాలు మరింత పెరిగిపోయాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం ఉండడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓ దారుణ విషయం వెలుగుచూసింది. ఓ హోటల్లో ఓ వ్యక్తి నాలుగేళ్లుగా ఒకే గదిని అద్దెకు తీసుకుంటూ ఉన్నాడు. అయితే అతడి ప్రవర్తన చూసి సిబ్బందికి ఎలాంటి అనుమానమూ రాలేదు. కానీ ఓ రోజు అతడి గదిని హోటల్ సిబ్బంది శుభ్రం చేస్తుండగా ఓ షాకింగ్ సీన్ కనిపించింది. అతడు భయంతో వణికిపోయాడు. పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి విచారణ ప్రారంభించారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..


అది ఢిల్లీ మహిపాల్‌పూర్‌లోని ఓ హోటల్‌. రోజు మాదిరే ఫిబ్రవరి 27న కూడా హోటల్ సిబ్బంది అన్ని గదులనూ శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ గదిలోకి వెళ్లిన వారికి షాకింగ్ సీన్ కనిపించింది. గదిలో బాలిక మృతదేహం చూసి షాక్ అయ్యారు. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి హోటల్ యాజమాన్యానికి తెలియజేశారు. తమ హోటల్లో ఓ బాలిక చనిపోయి ఉందంటూ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతర విచారణలో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

మీ భార్య ఈ రోజు డ్యూటీకి రాలేదంటూ పోలీసుల నుంచి ఫోన్.. కుటుంబ సభ్యులంతా కంగారుగా ఇంటికి వెళ్లి చూస్తే..


ఆ గదిని యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన శివమ్ చౌహాన్.. నాలుగేళ్లుగా బుక్ చేసుకున్నట్లు తెలిసింది. ఇతడికి గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన బాలిక, శివమ్ స్నేహితులని తెలిసింది. బాలికను హత్యచేసి పరారైనట్లు గుర్తించారు. నిందితుడు నాలుగేళ్లుగా ఒకే గదిని ఎందుకు బుక్ చేసుకున్నాడు, చనిపోయిన రోజు బాలికకు, శివమ్‌కు మధ్య ఏం జరిగింది, ఈ హత్యలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు, ఈ గదికి గతంలో ఎవరెవరు వచ్చి వెళ్లేవారు.. అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కొత్తగా కోడలు వచ్చిందని సంతోష పడ్డారు.. అయితే శోభనం మరుసటి రోజే అంతా ఆస్పత్రిలో చేరిక.. చివరకు అసలు విషయం తెలుసుకుని..

Updated Date - 2022-03-01T21:48:30+05:30 IST