Job Alert: వీటికి అప్లై చేశారా.. 20వేల పోస్టుల దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్!

ABN , First Publish Date - 2022-10-07T18:30:52+05:30 IST

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గుడ్ న్యూస్ చెప్పింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 20వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్ ఎగ్జా

Job Alert: వీటికి అప్లై చేశారా.. 20వేల పోస్టుల దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్!

ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గుడ్ న్యూస్ చెప్పింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 20వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్ ఎగ్జామినేషన్(CGL)-2022 ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్‌లు కూడా మొదలయ్యాయి. అయితే.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గడువు సమీపించింది. దరఖాస్తు చేసుకోవడానికి రేపే(అక్టోబర్ 8) లాస్ట్ డేట్. ఇంకా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోనటువంటి అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుంటే బెటర్. ఆలస్యం చేస్తే సర్వర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 



ఈ నోటిఫికెషన్ ద్వారా పలు మంత్రిత్వశాఖలు, విభాగాల్లో ఉన్న పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వంటి పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 18-32ఏళ్ల(నిబంధనల ప్రకారం వర్తించే ఏజ్ రిలాక్షేషన్స్‌తో కలిపి) మధ్య వయసు ఉన్న యువతి, యువకులు అర్హులు. అయితే.. అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ చదవి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 లెవల్స్‌ ఎగ్జామ్‌లలో ప్రతిభ చూపిన అభ్యర్థులు పోస్టులకు ఎంపికవుతారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రూ.47వేల నుంచి 1.51లక్షల వరకు నెల జీతం పొందుతారు. దరఖాస్తుతో పాటు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in‌ ను సందర్శించండి.


Updated Date - 2022-10-07T18:30:52+05:30 IST