కడుపుకోతను పంటిబిగువున భరిస్తూనే.. కన్నకూతురికి అంత్యక్రియలు చేసిన తల్లి.. భర్త లేకున్నా కష్టపడి పెళ్లి చేస్తే..

ABN , First Publish Date - 2022-07-02T23:25:14+05:30 IST

ఎనిమిదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా కూతురిని చదవించింది.. ఆ తర్వాత ఎంతో కష్టపడి కూతురి పెళ్లి చేసింది..

కడుపుకోతను పంటిబిగువున భరిస్తూనే.. కన్నకూతురికి అంత్యక్రియలు చేసిన తల్లి.. భర్త లేకున్నా కష్టపడి పెళ్లి చేస్తే..

ఎనిమిదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా కూతురిని చదవించింది.. ఆ తర్వాత ఎంతో కష్టపడి కూతురి పెళ్లి చేసింది.. అయితే కూతురి కాపురం సజావుగా సాగలేదు.. అదనపు కట్నం తీసుకురాలేదు, ఆడపిల్ల పుట్టింది అనే కారణంతో అత్తింటి వారు ఆమెను వేధించేవారు.. చివరకు మూడ్రోజుల క్రితం ఆమెను చంపేశారు.. కూతురి మరణ వార్త విని షాకైన తల్లి ఆమె అంత్యక్రియలను ఒక్కతే నిర్వహించింది.. కూతురి చితికి నిప్పంటించింది.. బీహార్‌లోని గయలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

దారుణం.. 90 ఏళ్ల వృద్ధురాలు మృతి.. పూడ్చిపెట్టిన మూడో రోజే మళ్లీ బయటకు తీయించిన గ్రామస్తులు.. కారణమేంటంటే..


గయలోని చంద్‌చౌరా ప్రాంతానికి చెందిన హేమంత్ చౌదరికి 6 సంవత్సరాల క్రితం సప్నతో వివాహం జరిగింది. భర్త, అత్తమామలో చేతిలో సప్న గురువారం హత్యకు గురైంది. హేమంత్ ఇంటి నుంచి సప్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సప్న మెడపై, శరీరంపై గాయం గుర్తులు ఉన్నాయి. పలు కారణాల వల్ల గత రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. సప్న మరణించిన సమయంలో, ఆమె 3 ఏళ్ల కూతురు మరొక గదిలో నిద్రిస్తోంది. సప్న మృతి చెందిన విషయం ఆమె తల్లి సావిత్రి దేవికి తెలిసింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


తన కూతురిని ఆమె భర్త, అత్తమామలే హత్య చేశారని సావిత్రి దేవి ఆరోపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడు హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సావిత్రి దేవికి పోలీసులకు అప్పగించారు. ఆమె కూతురి మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించింది. 

Updated Date - 2022-07-02T23:25:14+05:30 IST