భర్త తల నరికి దేవుడి గదిలో పెట్టిన తల్లి.. ఆ ఘోరం ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2022-03-16T05:34:26+05:30 IST

ఆమె కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది.. ఇంట్లో ఒంటరిగా ఉంటోంది.. కొడుకు, భర్తను పట్టించుకోవడం మానేసింది.. శనివారం రాత్రి ఆమె తన భర్తను దారుణంగా హతమార్చింది...

భర్త తల నరికి దేవుడి గదిలో పెట్టిన తల్లి.. ఆ ఘోరం ఎలా బయటపడిందంటే..

ఆమె కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది.. ఇంట్లో ఒంటరిగా ఉంటోంది.. కొడుకు, భర్తను పట్టించుకోవడం మానేసింది.. శనివారం రాత్రి ఆమె తన భర్తను దారుణంగా హతమార్చింది. నిద్రపోతున్న భర్త తలను మొండెం నుంచి వేరు చేసింది. అనంతరం ఆ తలను తమ ఇంట్లోని దేవుడి గుడిలో దాచింది. 


త్రిపురలోని ఇందిరా కాలనీకి చెందిన ఒక మహిళ శనివారం అర్ధరాత్రి తన భర్త తల నరికేసింది. రక్తం కారుతున్న తలను ప్లాస్టిక్ సంచిలో పెట్టింది. దానిని ఇంట్లోని దేవుడి గదిలో ఉంచింది. తెల్లవారు ఝామున లేచిన కొడుకు అక్కడి దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. రక్తం కారుతున్న కత్తితో కూర్చున్న తల్లిని చూసి షాకయ్యాడు. 


తర్వాతి రోజు ఆ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. తన తల్లి ఎప్పట్నుంచో మానసిక సమస్యతో బాధపడుతోందని, స్థానిక వైద్యుడి వద్ద చికిత్స కూడా తీసుకుంటోందని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. 

Read more