పాము కలలో కనిపిస్తే శుభమా? అశుభమా?
ABN , First Publish Date - 2022-10-30T08:09:55+05:30 IST
పాము కలలో కనిపించడాన్ని చాలామంది తీవ్రంగా పరిణగిస్తారు. పాము కలలో కనిపిస్తే వారు భవిష్యత్‌లో పెద్ద సమస్యను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతుంటారు.
పాము కలలో కనిపించడాన్ని చాలామంది తీవ్రంగా పరిణగిస్తారు. పాము కలలో కనిపిస్తే వారు భవిష్యత్‌లో పెద్ద సమస్యను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతుంటారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కలలో పాము బిలంలోకి వెళుతున్నట్టు కనిపిస్తే దానిని శుభ సంకేతంగా భావించాలని స్వప్నశాస్త్రం చెబుతోంది. దీని అర్థం రాబోయే కాలంలో మీకు ధనప్రాప్తి కలుగుతుందని భావించాలి. ఒకవేళ ఎవరికైనా కలలో నల్లని పాము కనిపిస్తే వారికి కాల సర్పదోషం ఉందని పండితులు చెబుతుంటారు. దీనికి పరిహారం చేయించుకోవాలని వారు సూచిస్తుంటారు. గోధుమరంగు పాము కలలో కనిపిస్తే దానిని శుభంగా భావించాలి. ఇటువంటి కల రావడమంటే అదృష్టం వరించనున్నదని అర్థం.
రాబోయే కాలంలో మీకు ధనం అందుతుందని అర్థం. నాగుపాముల జంటను భగవంతుని స్వరూపంగా భావిస్తారు. ఎవరికైనా కలలో నాగుపాముల జంట కనిపిస్తే వారికి భగవంతుని దర్శనం కలిగిందని అర్థం. ఇటువంటి కలలు వస్తే వారికి భవిష్యత్‌లో మంచి పరిణామాలు ఎదురవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలో ఎవరికైనా పాము కోరలు కనిపిస్తే దానిని అశుభంగా పరిగణించాలి. ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు. కలలో తెలుపురంగు పాము కనిపిస్తే దానిని శుభానికి గుర్తుగా భావించాలి. త్వరలో ధనప్రాప్తి కలగనుందని దీని అర్థం. ఒకవేళ పాము కాటుతో మృతి చెందినట్లు కలవస్తే దీనిని శుభ సంకేతంగా భావించాలి. ఇలాంటి కల వస్తే అది దీర్ఘాయువుకు సూచిక అని పండితులు చెబుతుంటారు.