పెళ్లి చేసుకున్న 15 రోజులకే నగలు తీసుకొని అక్కాచెల్లెళ్లు పరార్..

ABN , First Publish Date - 2022-05-24T09:24:40+05:30 IST

భర్త చనిపోయిన తర్వాత తన బిడ్డలిద్దరికీ పెళ్లిళ్లు అవడం లేదని ఓ తల్లి బాధ పడుతోంది. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఆమెను కలిశాడు. తమకు ఏడు లక్షల రూపాయలు ఫీజు ఇస్తే.. అన్నాతమ్ముళ్లు ఇద్దరికీ ఒకేసారి పెళ్లిచేస్తామని చెప్పారు. సరేనని ఆ డబ్బు ఇచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌కు...

పెళ్లి చేసుకున్న 15 రోజులకే నగలు తీసుకొని అక్కాచెల్లెళ్లు పరార్..

భర్త చనిపోయిన తర్వాత తన బిడ్డలిద్దరికీ పెళ్లిళ్లు అవడం లేదని ఓ తల్లి బాధ పడుతోంది. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఆమెను కలిశాడు. తమకు ఏడు లక్షల రూపాయలు ఫీజు ఇస్తే.. అన్నాతమ్ముళ్లు ఇద్దరికీ ఒకేసారి పెళ్లిచేస్తామని చెప్పారు. సరేనని ఆ డబ్బు ఇచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను పరిచయం చేశారు. వాళ్లిద్దరికీ అన్నాతమ్ముళ్లతో పెళ్లి చేశారు. పదిహేను రోజులపాటు సంతోషంగానే వారి కాపురం గడిచింది. హటాత్తుగా ఆ ఇద్దరు భార్యలు ఇంటి నుంచి పారిపోయారు. 


దాంతో ఏం చేయాలో తెలియని ఆ కుటుంబం.. పెళ్లి చేసిన దళారులను సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ల ఫోన్లు కూడా కలవలేదు. దాంతో పోలీసులను ఆశ్రయించింది. ఒక టీం ఏర్పాటు చేసుకున్న రాజస్థాన్ పోలీసులు.. యూపీకి వెళ్లి అక్కాచెల్లెళ్ల కోసం వెతికారు. అక్కడే అక్కాచెల్లెళ్లు ప్రీతి, చాందినీతోపాటు ఒక దళారిని కూడా అరెస్టు చేశారు. 


ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా ఇలా దొంగ పెళ్లిళ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు.

Updated Date - 2022-05-24T09:24:40+05:30 IST