సోదరిపై లైంగిక వేధింపులు.. అంగీకరించలేదని గొంతుకోసి పరారీ.. పోలీసులకు మరో షాకింగ్ విషయం చెప్పిన యువతి..
ABN , First Publish Date - 2022-10-18T00:37:42+05:30 IST
సవతి సోదరిని సోదరుడు లైంగికంగా వేధించిన ఉదంతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది.
సవతి సోదరిని సోదరుడు లైంగికంగా వేధించిన ఉదంతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది. శారీరక సంబంధానికి యువతి నిరాకరించడంతో నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. సోదరిని చంపడానికి ఆమె గొంతు కోశాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోదరుడే కాకుండా సవతి తండ్రి కూడా తనను వేధిస్తున్నాడని ఆమె పేర్కొంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి..
సైకో భర్త శాడిజం.. తొలి రేయి నుంచే నరకం.. హోటళ్లో స్నేహితులు, వారి భార్యలతో కలిసి..
జైపూర్‌లోని ఓ కాలనీలో నివసిస్తున్న 22 ఏళ్ల యువతి తన సవతి సోదరుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. ఈ నెల 13వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఆమె తన గదిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో సవతి సోదరుడు ఆమె గదికి వెళ్లాడు. ఆమెను బలవంతం చేశాడు. శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశాడు. అందుకు యువతి నిరాకరించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను చంపడానికి ఇనుప వస్తువుతో గొంతు కోశాడు. పెద్ద గాయం కాకపోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.
తర్వాతి రోజు ఉదయమే బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను సవతి సోదరుడు తరచుగా వేధిస్తున్నాడని పేర్కొంది. అంతేకాదు సవతి తండ్రి కూడా తనపై కన్నేశాడని, తనతో అసభ్యంగా మాట్లాడడం, తన శరీరాన్ని తాకడం వంటివి చేస్తున్నాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.