-
-
Home » Prathyekam » shocking twist took place when the husband returned from fetching a lift stick for his wife In Haryana kjr spl-MRGS-Prathyekam
-
బస్టాండ్‌లో ఉండగా లిప్‌స్టిక్ అడిగిన భార్య.. సరేనని షాపునకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి షాకింగ్ ట్విస్ట్.. అసలు కథేంటంటే..
ABN , First Publish Date - 2022-07-21T21:51:05+05:30 IST
ఆ దంపతులకు వివాహమై 8ఏళ్లు అవుతోంది. ఇన్నాళ్లూ ఆనందంగా ఉన్న వారి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో అందరి విషయంలోనే జరిగినట్లుగానే వీరి విషయంలో కూడా..

ఆ దంపతులకు వివాహమై 8ఏళ్లు అవుతోంది. ఇన్నాళ్లూ ఆనందంగా ఉన్న వారి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో అందరి విషయంలోనే జరిగినట్లుగానే వీరి విషయంలో కూడా గ్రామ పెద్దలు జోక్యం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలూ ఉండవనుకున్నారు. పంచాయితీ జరగడంతో భార్యను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. బస్టాండ్‌కు చేరుకోగానే, భార్య లిప్‌స్టిక్ తీసుకురమ్మని కోరడంతో.. భర్త తీసుకురావడానికి వెళ్లాడు. అయితే తిరిగొచ్చేసరికి షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హర్యానా రాష్ట్రం పాటియాలా పరిధి దేవిగర్ గ్రామానికి చెందిన యువకుడికి, కర్నాల్‌లోని పరిధిలోని గ్రామానికి చెందిన యువతితో 2014లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇన్నాళ్లూ వీరి మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల దంపతుల మధ్య సమస్యలు తలెత్తాయి. భార్యకు స్థానికంగా ఉన్న ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు తెలీకుండా అతడితో రాసలీలలు సాగించేది. అయితే ఇటీవల ఈ విషయం భర్తకు తెలియడంతో రోజూ గొడవలు జరిగేవి. చాలా సార్లు పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్లారు.
సెలవు రోజు కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన యువతి.. లోపలికి వెళ్లాక యజమాని ఒక్కడే ఉండడంతో షాక్.. చివరకు..
దీంతో కొన్నాళ్లుగా భార్య తన పుట్టింట్లో ఉంటోంది. మంగళవారం గ్రామ పెద్దలు పంచాయితీ చేసి దంపతులకు నచ్చజెప్పారు. అనంతరం భార్యను తీసుకుని సొంతూరికి బయలుదేరాడు. పెహోవా పట్టణంలోని బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే తనకు లిప్‌స్టిక్ కావాలని భార్య అడగడంతో తీసుకురావడానికి వెళ్లాడు. అయితే తిరిగొచ్చేసరికి కూతురుతో పాటూ భార్య అదృశ్యమైంది. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.