శాస్త్రవేత్తగా ఉద్యోగాన్ని వదిలేసి ఎందుకీ వ్యవసాయం.. అన్నవాళ్లే ఇప్పుడామె సంపాదన చూసి నివ్వెరపోతున్నారు..!

ABN , First Publish Date - 2022-06-23T21:20:16+05:30 IST

కశ్మీర్‌కు చెందిన ఆ దంపతులు దక్షిణ కొరియాలో శాస్త్రవేత్తలు.. ఇద్దరూ ఒకసారి తమ పిల్లలతో కలిసి స్కూల్ ట్రిప్‌నకు వెళ్లారు..

శాస్త్రవేత్తగా ఉద్యోగాన్ని వదిలేసి ఎందుకీ వ్యవసాయం.. అన్నవాళ్లే ఇప్పుడామె సంపాదన చూసి నివ్వెరపోతున్నారు..!

కశ్మీర్‌కు చెందిన ఆ దంపతులు దక్షిణ కొరియాలో శాస్త్రవేత్తలు.. ఇద్దరూ ఒకసారి తమ పిల్లలతో కలిసి స్కూల్ ట్రిప్‌నకు వెళ్లారు.. అక్కడ సహజ పద్ధతులలో పెరుగుతున్న ఓ స్ట్రాబెరీ తోటను చూసి ఆమె ఆలోచనలో పడింది.. తనెందుకు అలా చేయకూడదు అనుకుంది.. ఆమె భర్త కూడా ప్రోత్సహించడంతో రంగంలోకి దిగింది.. ఎంతో అధ్యయనం చేసి తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రారంభించింది.. నెలకు లక్షల్లో సంపాదిస్తోంది. 


ఇది కూడా చదవండి..

తనను తానే పెళ్లాడిన యువతి గురించి విన్నారుగా.. ఇప్పుడు తాజాగా మరో యువతి ఎవరిని వివాహం చేసుకుందో తెలిస్తే..


కశ్మీర్‌కు చెందిన ఇన్షా రసూల్‌ దక్షిణ కొరియాలో తన భర్తతో కలిసి శాస్త్రవేత్తగా పని చేసేది. ఆమె తన పిల్లలతో కలిసి ఒకసారి స్కూల్ ట్రిప్‌నకు వెళ్లినపుడు ఆమె దృష్టి ఆర్గానిక్ ఫార్మింగ్‌పై పడింది. స్వదేశానికి తిరిగి వచ్చి బుద్గామ్‌లో ఉన్న తన పూర్వీకుల భూమిలో సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించింది. ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు.  స్థానికంగా బాగా డిమాండ్ ఉన్న కూరగాయలు, స్వీట్‌కార్న్‌లను ఆమె భారీగా సాగుచేస్తోంది. పంట చేతికి రాక ముందే ఆమె ఉత్పత్తులు చాలా మటుకు అమ్ముడైపోతున్నాయి. 


`నేను శాస్త్రవేత్తగా సేంద్రీయ వ్యవసాయం గురించి చాలా అధ్యయనం చేశాను. కశ్మీర్‌లో సేంద్రియ వ్యవసాయం అంత సులభం కాదు. నేను దీనిని ఒక సవాలుగా తీసుకున్నాను. మాకు ప్రత్యేకమైన విత్తనాలు కావాలి. అవి యునైటెడ్ స్టేట్స్ నుంచి రావాలి. కొన్నిసార్లు వాటి రాకలో ఆలస్యం సమస్యలను కలిగిస్తుంది. అంతేకాకుండా, పెద్ద మొత్తంలో సేంద్రీయ పురుగుమందులను కొనేందుకు భారీ పెట్టుబడి అవసరం. నేను కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పని చేసుకుంటూ వెళుతున్నాను. సేంద్రీయ కూరగాయలను పండించే, వాటిని విక్రయించే అనేక మంది సాగుదారులతో నేను ఒప్పందం కుదుర్చుకున్నాను. నా ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. పంట చేతికి రాకముందే నా ఉత్పత్తులు చాలా వరకు అమ్ముడవుతాయ`ని ఇన్షా చెప్పింది. 

Read more