Seetha: వయసు 55 అయినా.. ఏమాత్రం తగ్గలేదు!
ABN , First Publish Date - 2022-12-01T14:12:23+05:30 IST
మనసు ప్రశాంతంగా ఉంటే ఆ ఆనందం, అందం ముఖంలో కనిపిస్తుంది అంటారు. సీనియర్ నటిని సీతను చూస్తే... వందశాతం ఇది నిజమే అనిపిస్తుంది. 1985లో పాండిరాజన్ దర్శకత్వంలో నటిగా పరిచయమైన ఆమె స్టార్ హీరోల సరసన నటించి పాపులల్ అయ్యారు.
మనసు ప్రశాంతంగా ఉంటే ఆ ఆనందం, అందం ముఖంలో కనిపిస్తుంది అంటారు. సీనియర్ నటి సీతను (Actress seetha)చూస్తే... వందశాతం ఇది నిజమే అనిపిస్తుంది. 1985లో పాండిరాజన్ దర్శకత్వంలో నటిగా పరిచయమైన ఆమె స్టార్ హీరోల సరసన నటించి పాపులల్ అయ్యారు. మూడున్నర దశాబ్ధాలుగా నటిగా కొనసాగుతున్న సీత వయసు 55. ఇప్పటికీ ఆమె అందం తగ్గలేదు. తాజాగా ఆమె స్పెషల్ ఫొటో షూట్‌ను (Photo shoot viral)సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఫొటో షూట్ ప్రేక్షకుల్ని మైస్మరైజ్ చేసేలా ఉన్నారు. ఫొటోలు వీక్షించిన నెటిజన్లు ‘అందానికి వయసుతో సంబంధం లేదు’ అని కామెంట్లు చేస్తున్నారు. 55 ఏళ్ల వయసులోనూ సీతను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సీత ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Seetha)
కథానాయికగా పీక్స్‌లో ఉన్న సమయంలో దర్శకుడు పార్దీబన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సీత. పెళ్లి అనంతరం నటనకు దూరమయ్యారు. భార్యభర్తలిద్దరికీ మధ్య వివాదం తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. తదుపరి నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అక్క, అమ్మ. పాత్రల్లో అలరిస్తున్నారు. 2010లో సురేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ బంధం కూడా నిలవలేదు.