Accident Video: స్కూటీపై వెళ్తున్న కుర్రాడు.. ఆగి ఉన్న కారు డ్రైవర్ చేసిన ఒక్క మిస్టేక్‌తో ప్రాణం పోయిందిలా..!

ABN , First Publish Date - 2022-07-16T21:22:49+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సుజన్‌పూర్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది

Accident Video: స్కూటీపై వెళ్తున్న కుర్రాడు.. ఆగి ఉన్న కారు డ్రైవర్ చేసిన ఒక్క మిస్టేక్‌తో ప్రాణం పోయిందిలా..!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సుజన్‌పూర్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారు డ్రైవర్ హఠాత్తుగా కారు డోర్ తెరిచాడు. ఆ డోర్‌ను ఢీకొట్టి స్కూటీపై వెళ్తున్న వ్యక్తి కిందపడిపోయాడు. 


ఆ యువకుడు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆ యువకుడు మృతి చెందాడు. ఈ దృశ్యం అక్కడ అమర్చి ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. యువకుడు హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలతో బయటపడేవాడని స్థానికులు చెబుతున్నారు.



Updated Date - 2022-07-16T21:22:49+05:30 IST

Read more