బాలికలను టార్గెట్ చేసిన స్కూల్‌ యజమాని.. పదో తరగతి బాలికే లక్ష్యంగా కుట్ర.. చివరకు ఓ రోజు..

ABN , First Publish Date - 2022-03-17T22:10:04+05:30 IST

రాజస్థాన్‌లో ఓ స్కూల్ యజమాని.. తమ పాఠశాలకు వచ్చే విద్యార్థినులను టార్గెట్ చేశాడు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నాడు. చివరకు..

బాలికలను టార్గెట్ చేసిన స్కూల్‌ యజమాని.. పదో తరగతి బాలికే లక్ష్యంగా కుట్ర.. చివరకు ఓ రోజు..
ప్రతీకాత్మక చిత్రం

విద్యాలయాలు దేవాలయాలతో సమానం అంటారు. కానీ ప్రస్తుతం కొన్ని విద్యాలయాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు.. రానురాను దారి తప్పుతున్నారు. విద్యార్థినులను వక్ర దృష్టితో చూస్తూ.. తమ కామవాంఛ తీర్చుకోవడానికి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఓ స్కూల్ యజమాని.. తమ పాఠశాలకు వచ్చే విద్యార్థినులను టార్గెట్ చేశాడు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నాడు. చివరకు అతడు చేసిన పని.. స్థానికంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పరిధిలో నివాసం ఉంటున్న దంపతులకు పదో తరగతి చదివే కుమార్తె ఉంది. రోజూ స్థానికంగా ఉండే పాఠశాలకు వెళ్లి వస్తూ ఉంటుంది. సదరు పాఠశాల యజమాని నిత్యం బాలికలనే టార్గెట్ చేసేవాడు. పాఠశాలలో సౌకర్యాలు, విద్యార్థుల బాగోగులను పట్టించుకోకుండా నిత్యం బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. రోజూ ఆమెతో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి దగ్గర చేసుకున్నాడు. ఓ రోజు ఎవరూ లేని సమయం చూసి బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా తరచూ బాలికపై ఘాతుకానికి పాల్పడేవాడు.

అమ్మా! త్వరగా తలుపు తీయి.. అంటూ డోర్ కొట్టిన కూతురు.. ఎంతకీ తీయకపోవడంతో వెనుక డోర్ నుంచి వెళ్లగా..


ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆమె రెండు నెలల గర్భంతో ఉందని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. తర్వాత బాలికను గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం నిందితుడ్ని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

బాలిక అపస్మారక స్థితిలో ఉంది.. త్వరగా వచ్చేయండి.. అంటూ స్నేహితులకు ఫోన్.. చివరకు ఇంటికి చేరుకున్న బాలిక ఇలా చెప్పడంతో..

Updated Date - 2022-03-17T22:10:04+05:30 IST