Whatsapp: వాట్సప్‌లో కొత్త తరహా మోసం.. ఖాళీ అవుతున్న ఖాతాలు!

ABN , First Publish Date - 2022-12-18T17:09:07+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సైబర్ మనీ మోసాలు (Cyber money frauds) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు కొత్తకొత్త మార్గాల్లో అమాయకులను బోల్తా కొట్టించి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు.

Whatsapp: వాట్సప్‌లో కొత్త తరహా మోసం.. ఖాళీ అవుతున్న ఖాతాలు!

ప్రపంచవ్యాప్తంగా సైబర్ మనీ మోసాలు (Cyber money frauds) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు కొత్తకొత్త మార్గాల్లో అమాయకులను బోల్తా కొట్టించి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఏటీఎం కార్డు స్కామ్, యూపీఐ స్కామ్ లేదా సిమ్ స్వాప్ మోసాల గురించి అందరికీ తెలిసినవే. అయితే కొత్తగా అందరినీ షాక్‌కు గురిచేసే నయా మోసం ఒకటి ఆస్ట్రేలియాలో (Australia) వెలుగుచూసింది. వాట్సప్ యూజర్లే టార్గెట్‌గా (Whatsapp Users) కుటుంబ సభ్యుల మాదిరిగా నమ్మించి మోసానికి పాల్పడుతున్నారు. ఫోన్ పోయిందని, అత్యవసరంలో ఉన్నానని చెప్పి డబ్బులు అడుగుతున్నారు. ఇలాంటి మోసాలు ఆస్ట్రేలియాలో ఇటివల తరచూ వెలుగుచూస్తున్నాయి. ‘హాయ్ మమ్’ (HI Mum) లేదా ‘కుటుంబ సభ్యుల పేరిట వంచన’ స్కామ్‌గా వీటిని పిలుస్తున్నారు.

వాట్సప్‌ యూజర్లనే టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. టెక్స్ట్‌ మెసేజ్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు మాదిరిగా ఫ్యామిలీ మెంబర్స్‌ను వేరే ఫోన్ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేస్తున్నారు. ఫోన్ పోయిందని, అందుకే వేరే వ్యక్తి నంబర్ నుంచి మెసేజ్ చేస్తున్నానని చెబుతున్నారు. ఒకవేళ బాధిత వ్యక్తి నమ్మాడని భావిస్తే డబ్బులు పంపించమని కోరుతున్నారు. ఈ కొత్త మోసానికి ఇటివల ఆస్ట్రేలియాలో చాలామంది బాధితులుగా మారారు. దాదాపు 7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.57.84 కోట్లు) మేర నష్టపోయినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

ఫోన్ పోయిందని లేదా డ్యామేజీ అయ్యిందని నమ్మిస్తున్నారు. అందుకే కొత్త నంబర్ నుంచి చేస్తున్నానని చెప్పారు. అర్జెంట్‌గా బిల్లు కట్టాలని నమ్మబలుకుతున్నారు. వ్యక్తిగత సమాచారం కూడా కోరుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. తద్వారా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను కూడా వాడుకుంటున్నారని చెప్పారు. ‘హాయ్ మమ్’ కేసులో గణనీయంగా పెరుగుతున్నాయని ‘ఆస్ట్రేలియన్ కన్స్యూమర్ అండ్ కాంపిటిషన్ కమిషన్ (ACCC) రిపోర్ట్ పేర్కొంది. ఇప్పటివరకు 1,150 మంది బాధితులుగా మారారని చెప్పారు. బాధితుల్లో ఎక్కువగా 50 ఏళ్లకుపైబడిన వయస్కులే ఉంటున్నారని వెల్లడించారు.

ఇలా భద్రంగా ఉండండి..

- ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు.

- డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పిన్, సీవీవీ నంబర్‌ను ఎవరితో పంచుకోవచ్చు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే జాగ్రత్తగా ఉండండి.

- తెలియని నంబర్ నుంచి వచ్చిన లింక్స్‌పై క్లిక్ చేయవద్దు.

- అనుమానిత మెసేజులు, లాగిన్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

- వెరిఫైడ్ సైట్స్‌పై మాత్రమే షాపింగ్ చేయాలి.

- తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు.

Updated Date - 2022-12-18T17:43:13+05:30 IST