సల్మాన్ రష్దీ నవలలో ఏముంది? ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే...

ABN , First Publish Date - 2022-08-13T15:29:29+05:30 IST

సాహిత్య ప్రపంచంలో ఆయనది ప్రత్యేకతకు...

సల్మాన్ రష్దీ నవలలో ఏముంది? ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే...

సాహిత్య ప్రపంచంలో ఆయనది ప్రత్యేకతకు పెట్టింది పేరు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరంలో ఆయన జన్మించారు. భారతదేశంలో పుట్టి, బ్రిటన్ పౌరసత్వం సాధించి, ఇప్పుడు అమెరికా పౌరసత్వంతో అక్కడే స్థిరపడ్డారు. ఆ ప్రముఖ వ్యక్తి పేరు సల్మాన్ రష్దీ. ఆయన ముంబైలోని కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో 1947, జనవరి 19న జన్మించారు. రష్దీ అవిభక్త భారతదేశంలో జన్మించిన పిల్లలపై ఒక నవల రాశారు. దాని పేరు మిడ్ నైట్ చిల్డ్రన్. ఈ పుస్తకం బుకర్ ప్రైజ్ గెలుచుకుంది.1988లో మరో పుస్తకం రాశారు. దానిపేరు 'సాటానిక్ వెర్సెస్'. ఈ పుస్తకంపై చాలా దుమారం రేగింది. 


భారతదేశంలో ఈ పుస్తకాన్ని నిషేధించారు. 1989లో ఇరాన్ అతనిపై ఫత్వా జారీ చేసింది. బ్రిటన్ వీధుల్లో రష్దీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పుస్తకాలను దహనం చేశారు. ఈ నేపధ్యంలో రష్దీ ఒక దశాబ్దం పాటు సురక్షిత గృహంలో నివసించవలసి వచ్చింది. అయినా కూడా ఆయన రాయడం ఆపలేదు. పదేళ్ల తర్వాత అతని జీవితం సాధారణ స్థితికి వచ్చింది. తాజాగా న్యూయార్క్‌లోని ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో అతనిపై కత్తితో దాడి జరిగింది. రష్దీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ ప్రసంగాలు చేశారు. రష్దీ రాసిన మిడ్‌నైట్ చిల్డ్రన్ పుస్తకం ఆధారంగా అదే పేరుతో  సినిమా కూడా తీశారు. రష్దీ రచించిన నాల్గవ నవల 'సాటానిక్ వెర్సెస్' అలజడి రేపింది. మీడియా కథనాల ప్రకారం ఈ నవలలోని అంశం ఇస్లాం మతానికి వ్యతిరేకం. రష్దీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. అతని ఈ నవల కారణంగా అతనికి 1988 నుండి చంపేస్తామంటూ బెదిరింపులు రావడం మొదలయ్యింది. రష్దీ భారతదేశానికి తిరిగి రావడం కష్టంగా మారింది.


ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ నవల వెర్సెస్' చూసి రగిలిపోయారు. ఇరాన్‌లో రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ కూడా 1989లో రష్దీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. అలాగే రష్దీని చంపిన వారికి $3 మిలియన్ల రివార్డు ప్రకటించారు. ఈ నవల జపనీస్ అనువాదకుడు హితోషి ఇగరాషి హత్యకు గురయ్యాడు. ఇటాలియన్ అనువాదకుడు, నార్వేజియన్ ప్రచురణకర్త దాడి నుండి తృటిలో తప్పించుకున్నారు. ఈ పుస్తకం గురించి తనపై వస్తున్న ఆరోపణలపై రష్దీ అనేక ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ 'ది సాటానిక్ వెర్సెస్'ను విచారణ లేకుండా నిషేధించారని ఆరోపించారు. దీనిపై నిర్మించిన చిత్రం భారతదేశంలో 2013న విడుదలైంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా సల్మాన్ రష్దీ స్వయంగా అందించారు. ఈ సినిమాకు పలువురి నుంచి అభినందలు అందాయి.  

Updated Date - 2022-08-13T15:29:29+05:30 IST