-
-
Home » Prathyekam » Removal of Mangalsutra by wife highest order of mental cruelty on husband says court sks-MRGS-Prathyekam
-
భార్య మంగళసూత్రాన్ని తొలగించడం క్రూరత్వం...Madras High Court
ABN , First Publish Date - 2022-07-15T16:02:13+05:30 IST
భార్య మంగళసూత్రం ధరించే విషయంలో చెన్నై హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది...

చెన్నై(తమిళనాడు): భార్య మంగళసూత్రం ధరించే విషయంలో చెన్నై హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం మానసిక క్రూరత్వానికి సంబంధించి అత్యున్నతమైన చర్య అని చెన్నై హైకోర్టు పేర్కొంది.మంగళసూత్రం వైవాహిక జీవితానికి ప్రతీక అని, భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.విడిపోవాలనుకున్న భార్య ముందుగా తాళి (మంగళసూత్రం)ని తీసివేయడం అనేది భర్తను మానసిక క్రూరత్వానికి గురిచేసినట్లు అవుతుందని మద్రాస్ హైకోర్టు బాధిత వ్యక్తికి విడాకులు మంజూరు చేసిందిఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ నగరంలోని ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సి శివకుమార్ సివిల్ అప్పీలును అనుమతిస్తూ న్యాయమూర్తులు విఎం వేలుమణి, ఎస్ సౌంథర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ స్థానిక ఫ్యామిలీ కోర్టులో 2016వ సంవత్సరం జూన్ 15వతేదీ నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.మహిళను పరీక్షించినప్పుడు భర్త నుంచి విడిపోయే సమయంలో ఆమె తన తాళి గొలుసును తొలగించినట్లు అంగీకరించింది. ప్రపంచంలోని భారతదేశంలో జరిగే వివాహ వేడుకలలో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని అందరికీ తెలిసిన విషయమని ధర్మాసనం ఎత్తి చూపింది.హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను కూడా కోర్టు ఉదహరించింది. ‘‘పిటిషనర్ తాళిని తొలగించినట్లు దాన్ని బ్యాంకు లాకరులో ఉంచినట్లు భార్య స్వయంగా అంగీకరించింది... ఏ హిందూ వివాహిత తన భర్త జీవించి ఉన్న సమయంలో ఏ సమయంలోనైనా తాళిని తీయదని తెలిసిన విషయమే.

స్త్రీ మెడలో తాళి అనేది పవిత్రమైన విషయం, ఇది వైవాహిక జీవితం యొక్క కొనసాగింపును సూచిస్తుంది. అది భర్త మరణించిన తర్వాత మాత్రమే తొలగించాలి.భార్య తాళిని తొలగించడం భర్తను మానసికంగా ప్రతిబింబించే చర్యగా చెప్పవచ్చు. భర్తకు క్రూరత్వం బాధను కలిగించవచ్చు, ప్రతివాది మనోభావాలను దెబ్బతీస్తుంది’’అని బెంచ్ పేర్కొంది.సుప్రీంకోర్టు, హైకోర్టుల నిర్ణయాల దృష్ట్యా.. భర్త తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ, వివాహేతర సంబంధం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా భార్య మానసికంగా హింసించిందని భావించేందుకు వెనుకాడేది లేదని న్యాయమూర్తులు తెలిపారు.
