Real life Mogli : రియల్ లైఫ్ మోగ్లీ.. కానీ ఈయన కథ విషాదాంతం..

ABN , First Publish Date - 2022-08-18T19:17:24+05:30 IST

రుడ్యార్డ్ కిప్లింగ్(Rudyard Kipling) లెజెండరీ నవల ‘ది జంగిల్ బుక్(The Jungle Book)’ తెలిసే ఉంటుంది. దానిలో మోగ్లీ(Mogli) అనే పాత్ర ఉంటుంది.

Real life Mogli : రియల్ లైఫ్ మోగ్లీ.. కానీ ఈయన కథ విషాదాంతం..

The Jungle Book : రుడ్యార్డ్ కిప్లింగ్(Rudyard Kipling) లెజెండరీ నవల ‘ది జంగిల్ బుక్(The Jungle Book)’ తెలిసే ఉంటుంది. దానిలో మోగ్లీ(Mogli) అనే పాత్ర ఉంటుంది. అప్పట్లో ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్‌(Famous Television Channel)లో ఈ ‘జంగిల్ బుక్’ సీరియల్ రూపంలో ప్రసారమయ్యేది. పిల్లలు దానిలో కేవలం మోగ్లీ పాత్ర కోసం టీవీలకు అతుక్కుపోయేవారు. మోగ్లీ చిన్న వయసులో ఉన్నప్పుడు తమ పెంపుడు జంతువు ఒకటి తప్పిపోతే.. దానిని వెదికేందుకు తండ్రితో కలిసి అడవిలోకి వెళతాడు. అక్కడ అతడు తప్పి పోతాడు. మోగ్లీని తోడేళ్లు దత్తత తీసుకుంటాయి. అప్పటి నుంచి ఆ చిన్నారి జంతువులా ప్రవర్తిస్తుంటాడు. నాలుగు కాళ్లతో నడవడం, గెంతడం, జంతువుల భాషలోనే సంభాషించడం వంటివి చేస్తుంటాడు. ఇదొక కాల్పనిక నవల.


దిన సానిచార్ అనే పేరు దాదాపు ఎవరికీ తెలియదు. ఎందుకంటే కాలక్రమంలో జనాలు అతన్ని మరచిపోయారు. దిన సానిచర్ల కథ విషాదాంతమే కానీ విస్మయం కలిగిస్తుంది. 1873వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని బులంద్‌షహర్ జిల్లా అడవుల్లో అతను నాలుగు కాళ్లపై జంతువుల మాదిరిగా పాకుతూ వేటగాళ్ల గుంపునకు కనిపించాడు. అప్పుడు అతని వయసు కేవలం ఆరేళ్లు. చిన్న వయసు నుంచే మానవులకు దూరంగా.. కనీసం మానవ సంరక్షణ కానీ, సోషల్ బిహేవియర్ కానీ భాష కానీ తెలియకుండా ఏకాకిలా జీవించాడు. 


సానిచార్‌ను గుర్తించిన వేటగాళ్ళ ప్రకారం.. ఆ చిన్నారిని చూడగానే అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. దీనికి ముందు వేటగాళ్ళు ఆ పిల్లవాడిని తల్లిదండ్రుల మాదిరిగా సంరక్షిస్తున్న తోడేలును చంపేయాల్సి వచ్చింది. రెస్క్యూ మిషన్(Resque mission) సమయంలో, వేటగాళ్ళు గుహకు నిప్పంటించారు. ఇది అన్ని తోడేళ్ళకు అంటుకుంది. ఇక ఆ చిన్నారి మానవ నాగరికత(Human Civilisation)కు తగ్గట్టుగా సెట్ అవడానికి చాలా టైమ్ పట్టింది. అతడిని ఆగ్రా సమీపంలోని సికంద్రా మిషన్ అనాథ శరణాలయానికి పంపించారు. అక్కడే అతనికి సానిచర్ అని పేరు పెట్టారు.


అయితే అక్కడ కూడా దుస్తులు ధరించడానికి ఇష్టపడేవాడు కాదు.. స్థానిక భాష అర్థం చేసుకోలేకపోయేవాడు. ఎముకలతో పళ్లకు పదును పెట్టి, మాంసాహారం మాత్రమే తినే సానిచార్‌ను తిరిగి మానవ సంస్కృతికి తగ్గట్టుగా తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టింది. సానిచార్‌ను చైల్డ్ సైకాలజిస్ట్ వేన్ డెన్నిస్ అధ్యయనం చేశారు. 1941 అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ(American Journal of Psychology)లో దినాకు 'మానవులతో అనుబంధం లేదని.. వేడి, చలికి పెద్దగా స్పందించడని పేర్కొన్నారు. అయితే ఈ చిన్నారిని మరో చిన్నారి సానుభూతితో అక్కున చేర్చుకున్నాడని.. అతని స్నేహమే కొన్ని అలవాట్లను మాన్పించిందని డెన్నిస్ జర్నల్‌లో పేర్కొన్నారు. సానిచార్ 34 సంవత్సరాల వయస్సులో మరణించాడు. 1895లో క్షయ వ్యాధి కారణంగా అతని ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. కానీ అతను చనిపోయే ముందు మాత్రం సరిగ్గా దుస్తులు ధరించడం.. చక్కగా ప్లేటులో భోజనం చేయడం వంటివి అలవరుచుకున్నాడు. 

Updated Date - 2022-08-18T19:17:24+05:30 IST