Rat in the meeting: మీటింగ్‌కు విశిష్ట అతిథి.. టేబుల్ పైన ఎలుక ఏం చేస్తోందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-12-07T14:54:02+05:30 IST

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఓ ఎలుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది.

Rat in the meeting: మీటింగ్‌కు విశిష్ట అతిథి.. టేబుల్ పైన ఎలుక ఏం చేస్తోందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఓ ఎలుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ గదిలో మీటింగ్ జరుగుతోంది. కొందరు వ్యక్తులు టేబుల్ చుట్టూ కూర్చుని ఏదో విషయం గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంతలో అక్కడకు ఓ ఎలుక (Rat in the meeting) వెళ్లింది.

టేబుల్‌పై ఓ వ్యక్తి ముందు ఉంచిన పుష్ప గుచ్చం దగ్గర ఉన్న కేక్ ప్లేట్ దగ్గరకు నెమ్మదిగా వెళ్లింది. ఉద్యోగులంతా సీరియస్‌గా మాట్లాడుకుంటుండగా.. ఆ ఎలుక మాత్రం హ్యాపీగా ప్లేట్‌లో ఉన్న కేక్‌ (Rat eating cake) లాంగించేసింది. ఆ మీటింగ్‌ను కవర్ చేస్తున్న కెమేరామ్యాన్ దృష్టి ఆ ఎలుకపై పడింది. దీంతో ఆ ఎలుక కేక్ తింటుండడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

Updated Date - 2022-12-07T14:54:04+05:30 IST