Viral Video: పావురంపై ఎలుకకు ఎందుకంత కోపం.. అది ఏం తప్పు చేసింది!
ABN , First Publish Date - 2022-07-23T19:23:38+05:30 IST
సాధారణంగా మనకు పావురం కనిపిస్తే.. ఎంతో ప్రేమతో దానికి గింజలు వేస్తాం. వాటితో సరదాగా గడపాలని అనుకుంటాం. బహుశా అది ఓ ఎలుకకు నచ్చలేదేమో.. పావురంపై దాడి చేసింది. ఎన్నిరోజుల నుంచో కక్ష
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనకు పావురం కనిపిస్తే.. ఎంతో ప్రేమతో దానికి గింజలు వేస్తాం. వాటితో సరదాగా గడపాలని అనుకుంటాం. బహుశా అది ఓ ఎలుకకు నచ్చలేదేమో.. పావురంపై దాడి చేసింది. ఎన్నిరోజుల నుంచో కక్ష పెంచుకుని దాని ప్రాణం తీయాలని ఎదురుచూసినట్టు ప్రవర్తించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(viral)గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
జనం వేసే గింజలు, చూపిస్తున్న ప్రేమ తనకు దక్కడం లేదన్న అక్కసో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ ఓ ఎలుక (Rat) మత్రం షాకింగ్‌గా ప్రవర్తించింది. దానికున్న శక్తి మొత్తాన్ని ఉపయోగించి.. అక్కడ ఉన్న పావురం(Pigeon)పై అటాక్ చేసింది. అంతేకాకుండా దాన్ని పట్టుకుని రోడ్డపై ఈడ్చుకుపోయింది. అంతేకాకుండా దాన్ని చంపేసేందుకు పక్కన కారు కిందకు లాక్కెల్లింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. ఎలుక ప్రవర్తన చూసి షాకైన స్థానికులు.. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో(Video) నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఆ వీడియోను 1.7 మిలియన్ల మంది వీక్షించారు.