ఆ రైల్వే స్టేషన్ల పేర్లు వింటే తెగ నవ్వుకుంటారు... దేశంలోని విచిత్ర రైల్వే స్టేషన్లు ఇవే!

ABN , First Publish Date - 2022-12-15T11:00:53+05:30 IST

భారతదేశంలో విచిత్రమైన పేర్లతో కూడిన రైల్వే స్టేషన్లు కొన్ని ఉన్నాయి. ఆ పేర్లను విన్నప్పుడు తెగ నవ్వు వస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ రైల్వే స్టేషన్ల పేర్లు వింటే తెగ నవ్వుకుంటారు... దేశంలోని విచిత్ర రైల్వే స్టేషన్లు ఇవే!

భారతదేశంలో విచిత్రమైన పేర్లతో కూడిన రైల్వే స్టేషన్లు కొన్ని ఉన్నాయి. ఆ పేర్లను విన్నప్పుడు తెగ నవ్వు వస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాప్

ఈ పేరు వినగానే ఈ స్టేషన్ అన్ని స్టేషన్లకు తండ్రేమోనని అనిపిస్తుంది. అయితే ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న అతి చిన్న రైల్వే స్టేషన్.

సింగపూర్ రోడ్

అది సింగపూర్ రోడ్ రైల్వే స్టేషన్. అయితే ఇక్కడకు వెళ్లాలంటే ఎవరికీ వీసా అవసరం ఉండదు. ఈ సింగపూర్ రోడ్ స్టేషన్ ఒడిశాలో ఉంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళుతుంటాయి.

టిట్వాలా

ఈ రైల్వే స్టేషన్ ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ సెంట్రల్ లైన్‌లో ఉంది. ఇది కళ్యాణ్, కసరా మధ్యలో ఉంది. ఈ స్టేషన్‌కు ఒకవైపు అంబివాలి రైల్వే స్టేషన్, మరొక వైపు ఖడవలి రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

లాందీఖానా రైల్వే స్టేషన్

దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఈ రైల్వే స్టేషన్ ఏర్పడింది. Twitterలోని @IndiaHistorypic ఖాతా ప్రకారం ఈ ఫోటో 1930ల నాటిది. ఈ స్టేషన్ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దులో ఉంది. లందీఖానా రైల్వే స్టేషన్ తోర్ఖం సమీపంలో ఉంది. బ్రిటీష్ పాలనలో 1926 ఏప్రిల్ 23న లాండిఖానా రైల్వే స్టేషన్ ఏర్పాటయ్యింది.

ఫఫూంద్

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఏ కేటగిరీ రైల్వే స్టేషన్. ఇది ఔరయా జిల్లా, దిబియాపూర్ జిల్లా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ స్టేషన్ బ్రిటిష్ పాలనలో నిర్మితమయ్యింది. ఈ స్టేషన్‌లో ఐదు ట్రాక్‌లు, నాలుగు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.

Updated Date - 2022-12-15T11:03:22+05:30 IST