10 మంది తినేది ఒక్కడే తింటాడంటూ ఫంక్షన్లకు కూడా పిలవని బంధువులు.. 200 కేజీల బరువున్న ఈ వ్యక్తికి అరుదైన రోగం..!

ABN , First Publish Date - 2022-06-11T18:28:01+05:30 IST

పై ఫొటోలోని వ్యక్తి పేరు మహ్మద్ రఫీక్ అద్నాన్.. 30 సంవత్సరాల ఈ వ్యక్తి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు..

10 మంది తినేది ఒక్కడే తింటాడంటూ ఫంక్షన్లకు కూడా పిలవని బంధువులు.. 200 కేజీల బరువున్న ఈ వ్యక్తికి అరుదైన రోగం..!

పై ఫొటోలోని వ్యక్తి పేరు మహ్మద్ రఫీక్ అద్నాన్.. 30 సంవత్సరాల ఈ వ్యక్తి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.. ఆ వ్యాధి పేరు బులిమియా నెర్వోసా.. పరిమితులు లేకుండా ఆహారం తీసుకోవడం అనేది ఈ వ్యాధి లక్షణం.. రఫీక్ ప్రతిరోజూ 3 కిలోల బియ్యం, 4 కిలోల గోధుమ పిండితో చేసిన రోటీలు, 2 కిలోల మాంసం, 1.5 కిలోల చేపలు తింటాడు. వాటితో పాటు రోజులో మూడుసార్లు ఒక లీటరు పాలు తాగుతాడు. మొత్తం మీద రఫీక్ రోజుకు 14-15 కిలోల ఆహారాన్ని తీసుకుంటాడు. రఫీక్ ప్రస్తుత బరువు 200 కిలోలు. పుట్టినప్పటి నుంచి రఫీక్ అధిక ఆహారం తీసుకునేవాడు. 


ఇది కూడా చదవండి..

పెళ్లయిన 20 రోజుల తర్వాత ప్రేయసికి ఫోన్.. ప్రియుడు పిలిచాడని తెల్లవారుజామున 4 గంటలకు ఆమె వెళ్తే..


రఫీక్‌కు సరిపడే వంట చేయడం ఒక మనిషికి సాధ్యం కాదు. అందుకే అతను రెండు వివాహాలు చేసుకున్నాడు. భార్యలిద్దరూ కలిసి రఫీక్‌కు సరిపడే వంట చేసి పెడుతుంటారు. ఊబకాయం కారణంగా రఫీక్‌కు సంతానం కలగలేదు. రఫీక్ ప్రస్తుతం నడవడానికి కూడా చాలా ఇబ్బందిపడుతున్నాడు. సాధారణ బైక్‌లు అతని బరువు మొయ్యలేవు కాబట్టి.. బుల్లెట్‌నే వాడుతుంటాడు. అది కూడా అప్పుడప్పుడు రఫీక్‌ను మోయలేక ఇబ్బంది పెడుతుంటుంది. రఫీక్ తీసుకునే ఆహారం గురించి తెలిసి బంధువులు, స్నేహితులు అతడిని శుభకార్యాలకు పిలవడానికి కూడా భయపడుతుంటారు. రఫీక్ తన గ్రామంలో సంపన్న రైతు. అందువల్ల అతనికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ లేదు.


రఫీక్‌కు చికిత్స అందించే డాక్టర్ మృణాల్ రంజన్ మాట్లాడుతూ.. `రఫీక్‌కు బులిమియా నెర్వోసా అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా తింటుంటారు. ఈ వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. లేదంటే రోగి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. చాలా నెమ్మదిగా అతను తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించుకుంటూ రావాల`ని చెప్పారు.  

Updated Date - 2022-06-11T18:28:01+05:30 IST