భార్యతో గొడవ.. పిల్లలతో కలిసి నదిలోకి దూకేసిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-06-04T18:26:39+05:30 IST
అతను తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.. భార్యాభర్తలు తరచుగా గొడవపడేవారు..

అతను తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.. భార్యాభర్తలు తరచుగా గొడవపడేవారు.. తాజాగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త, పిల్లలతో కలిసి నర్మదా నదిలోకి దూకేశాడు.. డైవర్లు అతడిని కాపాడారు.. కానీ, ఇద్దరు పిల్లలు చనిపోయారు.. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తిపై పోలీసులు మర్డర్ కేసు పెట్టారు.. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్‌తో ప్రేమ, పెళ్లి.. తర్వాత అసలు విషయం తెలిసి షాక్!
నర్మదాపురంకు చెందిన రాజేష్ తల్వార్ భార్య కాలికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు నాలుగు రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయింది. ఇంట్లో తరచుగా గొడవ పడే భార్యాభర్తలు హాస్పిటల్లో కూడా వాగ్వాదానికి దిగారు. శుక్రవారం రాత్రి కూడా వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తన ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. నర్మదా బ్రిడ్జిపై నుంచి పిల్లలతో కలిసి నదిలోకి దూకేశాడు. అతను నదిలోకి దూకడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే స్పందించి డైవర్లను తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన డైవర్లు రాజేష్‌ను కాపాడారు. అయితే పిల్లలు మాత్రం దొరకలేదు. చివరకు శనివారం ఉదయం ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు రాజేష్‌పై హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజేష్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.