Prasanth Varma: దయ చేసి క్షమించండి!

ABN , First Publish Date - 2022-11-27T19:43:19+05:30 IST

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘హను-మాన్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది.

Prasanth Varma: దయ చేసి క్షమించండి!

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma )ప్రేక్షకులకు క్షమాపణలు (Prashant Varma apologies)చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘హను-మాన్‌’(Hanu-man) చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది. ప్రశంసల నడుమ ఆయన ప్రేక్షకులకు క్షమాపణ చెప్పారు. అసలు విషయం ఏంటంటే... తాజాగా జరిగిన టీజర్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘‘రామాయణం మన చరిత్ర అని చెప్పబోయి ‘పురాణం’ అని ప్రసంగించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ నా ప్రసంగంలో రామాయణం మన చరిత్ర అని చెప్పబోయి పురాణం’ అని పలికాను. అందుకు నన్ను క్షమించండి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘అ’ సినిమా సక్సెస్‌ తర్వాత ఆయన ‘తేజా సజ్జాతో జాంబిరెడ్డి’ చిత్రం తీశారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘హను-మాన్‌’. విభిన్నమైన కథాంశంతో సూపర్‌హీరో చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Updated Date - 2022-11-27T19:43:21+05:30 IST