23ఏళ్ల వయసులో ప్రముఖ YouTuber మృతి.. ఒకవేళ 100 జన్మలుంటే మళ్లీ మళ్లీ ఇలాగే జన్మిస్తానని తన చివరి లేఖలో వెల్లడి
ABN , First Publish Date - 2022-07-02T18:01:47+05:30 IST
చిన్న వయసులోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుని ప్రముఖ యూట్యూబర్‌గా ఎదిగాడు. తన మాటలతో ఫాలోవర్లను మెస్మరైజ్ చేశాడు. కానీ.. విధి అతడిని చిన్న చూపు చూసింది. అతడి ఎదుగుదలను చూసి..

ఇంటర్నెట్ డెస్క్: చిన్న వయసులోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుని ప్రముఖ యూట్యూబర్‌గా ఎదిగాడు. తన మాటలతో ఫాలోవర్లను మెస్మరైజ్ చేశాడు. కానీ.. విధి అతడిని చిన్న చూపు చూసింది. అతడి ఎదుగుదలను చూసి.. ఓర్వలేకపోయింది. దీంతో పిన్న వయసులోనే ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. అయితే.. ప్రాణాలు వదలడానికి ముందు అతడు తన ఫాలోవర్లను ఉద్దేశించి రాసిన లేఖలోని మాటలు అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.
Technoblade అనే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ యూట్యూబర్ అలెక్స్ 23ఏళ్ల వయసులో మరణించాడు. Minecraft Game సిరీస్‌కు బ్యాగ్రౌండ్లో తన మాటలను జోడించి.. 11 మిలియన్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న అతడు క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని స్వయంగా అలెక్స్ తండ్రే.. టూబ్యూబ్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా పాలోవర్లను ఉద్దేశించి.. తన కొడుకు రాసిన చివరి లెటర్‌ను ఆయన చదివి వినిపించారు. లేఖలో అలెక్స్.. ‘అందరికీ హలో.. టెక్నోబ్లేడ్ ఇక్కడ. ఈ లెటర్‌కు సంబంధించిన వీడియో చుస్తున్న సమయానికి నేను బతికుండను. ఒక వేళ నాకు వంద జన్మలు ఉంటే.. కచ్చితంగా మళ్లీ మళ్లీ టెక్నోబ్లేడ్గా జీవించాలని కోరుకుంటా. గడిచిన కాలం మొత్తం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం’ అని పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన 8 గంటల తర్వాత అలెక్స్ కన్నుమూసినట్టు అతడి తండ్రి చెప్పారు. ఇదే సమయంలో అలెక్స్ తల్లి కూడా మాట్లాడారు. తన కొడుకు ఎప్పుడూ పాపులారిటీ కోసం వెంపర్లాడలేదని.. తన పని తాను చేసుకుంటూ వెళ్లినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. Technoblade అమెరికాకు చెందిన యూట్యూబర్.