సూట్‌కేస్‌లో 22 ఏళ్ల కుర్రాడి మృతదేహం.. విచారణలో అసలు నిజాలు తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..

ABN , First Publish Date - 2022-02-06T01:13:29+05:30 IST

అది ఢిల్లీలోని సరోజినీనగర్ మెట్రో స్టేషన్ ప్రాంతం. జన సంచారంతో ఆ రోడ్డంతా రద్దీగా ఉంది. అంతలో కొందరికి ఓ సూట్‌కేస్ కనిపించింది. దీంతో భయపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి...

సూట్‌కేస్‌లో 22 ఏళ్ల కుర్రాడి మృతదేహం.. విచారణలో అసలు నిజాలు తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..

అది ఢిల్లీలోని సరోజినీనగర్ మెట్రో స్టేషన్ ప్రాంతం. జన సంచారంతో ఆ రోడ్డంతా రద్దీగా ఉంది. అంతలో కొందరికి ఓ సూట్‌కేస్ కనిపించింది. దీంతో భయపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాన్ని తెరచి చూస్తే.. మృతదేహం బయటపడింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. విచారణలో భాగంగా సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


పోలీసుల కథనం మేరకు.. దక్షిణ ఢిల్లీ ఉత్తమ్ నగర్‌లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ప్రేమిర్‌ వద్ద.. జార్ఖండ్‌లోని కోదర్మా జిల్లాకు చెందిన షంషేర్ ఖాన్‌.. సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడే అసలు మలుపు మొదలైంది. వ్యాపారవేత్తకు, షంషేర్ ఖాన్‌కి మధ్య సంబంధం ఏర్పడడమే సమస్యలకు దారి తీసింది. స్వతహాగా స్వలింగ సంపర్కులైన ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వ్యాపారవేత్తను నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత.. యువకుడు వివిధ కారణాలు చెబుతూ వ్యాపారవేత్త వద్ద డబ్బులు డిమాండ్ చేయడం మొదలెట్టాడు.

అయ్యో పాపం.. మరీ ఇంత ఘోరమా.. ప్రియుడి పెళ్లిని ఆపేందుకు ఈ యువతి ఎంత నీచానికి పాల్పడిందంటే..


రోజురోజుకూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండడంతో వ్యాపారి విసిగిపోయేవాడు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ యువకుడు బెదిరించడం మొదలెట్టాడు. దీంతో ఎలాగైనా అతడిని అంతమొందించాలని వ్యాపారవేత్త నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన మేనల్లుడు, మరో వ్యక్తిని పిలిపించాడు. జనవరి 29న యూసుఫ్ సరాయ్‌లోని గెస్ట్‌హౌస్‌‌కు సదరు యువకుడిని రమ్మని చెప్పి.. అంతా కలిసి అతన్ని గొంతు కోసి హత్య చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

నిద్రలోంచి లేవగానే గదిలో కనిపించని అక్క.. అనుమానంతో తల్లిదండ్రులకు చెప్పిన చెల్లి.. ఇంటి వెనుక షాకింగ్ సీన్ చూసి..

Updated Date - 2022-02-06T01:13:29+05:30 IST