ఊరి చివర చెట్టుకు ఉరేసుకున్న భర్త.. కాస్త దూరంలోనే భార్య మృతదేహం.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2022-01-22T01:01:28+05:30 IST

ఊరి చివర చెట్టుకు భర్త ఉరికి వేలాడడం చూసి గ్రామస్తులంతా షాక్ అయ్యారు. అంతలోనే కాస్త దూరంలో భార్య మృతదేహం కూడా కనిపించడంతో ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. ఒక్కసారిగా గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి..

ఊరి చివర చెట్టుకు ఉరేసుకున్న భర్త.. కాస్త దూరంలోనే భార్య మృతదేహం.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే..

అంతకు ముందు రోజు వరకూ గ్రామస్తుల మధ్య తిరిగిన దంపతులు.. మరుసటి రోజు శవమై కనిపించడం సంచలనం కలిగించింది. ఊరి చివర చెట్టుకు భర్త ఉరికి వేలాడడం చూసి గ్రామస్తులంతా షాక్ అయ్యారు. అంతలోనే కాస్త దూరంలో భార్య మృతదేహం కూడా కనిపించడంతో ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. ఒక్కసారిగా గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ పరిధి  ఠాకూర్ తోలా ప్రాంతానికి చెందిన వర్మ (32),  సంగీత వర్మ (25) దంపతులు. వివాహ అనంతరం చాలా కుటుంబాల్లో జరిగినట్లుగానే.. కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న వీరి మధ్య, మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. రోజూ గొడవలు పడేవారు. ఉమ్మడి కుటుంబం కావడమే ఈ గొడవలకు ప్రధాన కారణమైంది. విడిగా కాపురం పెడదామని భర్తతో అనడంతో వర్మ మాత్రం అందుకు అంగీకరించలేదు. తన తల్లిదండ్రులను వదిలి వచ్చేది లేదని, అంతా కలిసి ఉన్నామంటూ చెప్పేవాడు. అయితే సంగీత మాత్రం ఈ విషయంలో తరచూ భర్తతో గొడవపడేది.

ప్రియుడితోనే వెళ్లు..! భార్యను సాగనంపిన భర్త.. చివరగా ఒకే ఒక్క కండీషన్ పెట్టాడు..


ఈ క్రమంలో ఓ రోజు గొడవలు పెద్దవవడంతో సంగీత పుట్టింటికి వెళ్లింది. కొన్నాళ్ల అనంతరం గత గురువారం అత్తగారి ఇంటికి వెళ్లిన భర్త.. భార్యను బైకుపై తీసుకొచ్చాడు. దారిలో కూడా ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ.. తమ ఊరికి 15కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తాను కూడా చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..

Updated Date - 2022-01-22T01:01:28+05:30 IST