అవును.. 19 ఏళ్ల నా కూతుర్ని నేనే చంపేశా.. కానీ ఆమె మేలు కోరే చేశానంటూ.. ఓ తల్లి వింత వాదన వెనుక కథేంటంటే..

ABN , First Publish Date - 2022-06-18T00:09:46+05:30 IST

పిల్లలను తల్లి తన కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తల్లిని చిత్రహింసలు పెట్టే పిల్లలను ఉంటారే గానీ.. పిల్లలను ఇబ్బంది పెట్టే తల్లులు ఉండరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే...

అవును.. 19 ఏళ్ల నా కూతుర్ని నేనే చంపేశా.. కానీ ఆమె మేలు కోరే చేశానంటూ.. ఓ తల్లి వింత వాదన వెనుక కథేంటంటే..
ప్రతీకాత్మక చిత్రం

పిల్లలను తల్లి తన కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తల్లిని చిత్రహింసలు పెట్టే పిల్లలను ఉంటారే గానీ.. పిల్లలను ఇబ్బంది పెట్టే తల్లులు ఉండరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లి మాత్రం.. తన కూతుర్ని తానే చంపేశానని చెబుతోంది. అయితే తన కూతురు మేలు కోరే అలా చేశానని సమర్థించుకుంటోంది. ఇంతకీ ఈ తల్లి వింత వాదన వెనుక అసలు కథేంటంటే..


ముంబయిలోని పశ్చిమ అంధేరీ పరిధి పార్షివాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రద్ధా పట్ట్యానే అనే మహిళకు భర్త, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. శ్రద్ధా వీధుల్లో అల్పాహారం విక్రయిస్తుండగా.. ఆమె భర్త స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో చిన్న గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె వైష్ణవి (19).. చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతోంది. దీంతో వైష్ణవి బాగోగులను చూసుకుంటూ, బయట అల్పాహారం విక్రయిస్తూ ఉండేది. అయితే కూతురు పెద్దది కావడంతో ఆమెకు స్నానం చేయించడం, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. చిన్న గదిలో భర్త ముందే కూతురికి సపర్యలు చేయడం.. శ్రద్ధాకు ఇబ్బందిగా అనిపించేది. అయినా చేసేదేమీలేక అలాగే నెట్టుకొచ్చేది. కూతురి వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో శ్రద్ధాకు రోజురోజుకూ చాలా సమస్యలు ఎదురయ్యేవి. కూతురిని చంపేసి.. నరకం నుంచి తప్పించాలని నిర్ణయించుకుంది.

జైలు నుంచి రిలీజ్ అవుతున్న స్నేహితుడికి స్వాగతం.. పబ్లిక్ న్యూసెన్స్ అంటూ 83 మంది అరెస్ట్.. వారిలో 33 మంది ఎవరో తెలిసి..


బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురు గొంతు కోసి హత్య చేసింది. తర్వాత ఫ్యాన్‌కు చీర వేలాడదీసి, ఆత్మహత్యగా చిత్రీకరించింది. ‘‘నా కూతురు ఆత్మహత్య చేసుకుంది’’.. అంటూ గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారంతా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వైష్ణవిని ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదికలో హత్య చేసినట్లు తేలడంతో, ఆ సమయంలో ఇంట్లో ఉన్న శ్రద్ధాను అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు తన కూతురిని తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

16 ఏళ్ల కూతురికి రహస్యంగా పెళ్లి చేసిన తల్లి.. అంతకుముందు రోజు ఆమె చేసిన నీచమేంటో సీసీటీవీలో రికార్డవడంతో..

Updated Date - 2022-06-18T00:09:46+05:30 IST