కవల అక్కాచెల్లెళ్ళను పెళ్ళిచేసుకున్న అబ్బాయి అరెస్ట్.. పోలీసులు చెబుతున్న కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-12-07T12:17:40+05:30 IST

అబ్బాయి ప్రస్తుతం జైలు గోడల మధ్య కాలం వెళ్ళదీస్తున్నాడు.

కవల అక్కాచెల్లెళ్ళను పెళ్ళిచేసుకున్న అబ్బాయి అరెస్ట్.. పోలీసులు చెబుతున్న కారణమేంటంటే..

ఒకే అబ్బాయిని పెళ్ళి చేసుకున్న కవల అక్కాచెళ్ళెళ్ళ గురించి సోషల్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి. వీరి విషయం వైరల్ గా మారింది. అయితే వారు పెళ్ళి చేసుకున్న ఆ అబ్బాయి ప్రస్తుతం జైలు గోడల మధ్య కాలం వెళ్ళదీస్తున్నాడు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన కొత్త పెళ్ళికొడుకుకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అంటే..

రింకు-పింకు అనే ఇద్దరు కవల అక్కాచెల్లెళ్ళను పెళ్ళిచేసుకున్న అతుల్ అనే అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అమ్మాయిలను అరెస్ట్ చెయ్యకుండా అబ్బాయిని మాత్రమే అరెస్ట్ చెయ్యడం ఏంటని పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఓ న్యాయవాది దానికి తగిన విశ్లేషణ ఇచ్చారు. వారికి ఒకేసారి పెళ్ళి జరిగినా అబ్బాయి మొదటిసారి తాళి కట్టి, పూలహారం ఎవరికి వేస్తాడో వారితో మొదటి పెళ్ళి జరిగిపోయినట్టే. ఆ తరువాత మరొక అమ్మాయిని చేసుకోవడం హిందూ వివాహ చట్టరీత్యా నేరం. కాబట్టి పోలీసులు అమ్మాయిలను వదిలేసి అబ్బాయిని అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. విడాకులు లేకుండా రెండవ పెళ్ళి చేసుకోవడం నేరమని 1995లోనే భారతదేశంలో చట్టం ఏర్పడింది.

Updated Date - 2022-12-07T12:17:42+05:30 IST