ప్లే బాయ్‌కి నిజమైన అర్థం ఏమిటో తెలుసా? ఈ పదాన్ని ఎవరి కోసం వినియోగిస్తారంటే...
ABN , First Publish Date - 2022-11-17T09:47:58+05:30 IST
ప్లేబాయ్ అనే పదాన్ని మీరు వినేవుంటారు. అయితే దాని నిజమైన అర్థం ఏమిటో మీకు మీకు తెలుసా? ప్లేబాయ్ అనే పదాన్ని అసభ్యతను ఇష్టపడే వ్యక్తులను ఉదహరించేందుకు వాడుతుంటారు.
ప్లేబాయ్ అనే పదాన్ని మీరు వినేవుంటారు. అయితే దాని నిజమైన అర్థం ఏమిటో మీకు మీకు తెలుసా? ప్లేబాయ్ అనే పదాన్ని అసభ్యతను ఇష్టపడే వ్యక్తులను ఉదహరించేందుకు వాడుతుంటారు. మరికొందరు ఈ పదాన్ని అజాగ్రత్త పరులను సంబోధించేందుకు ఉపయోగిస్తారు. అయితే ప్లేబాయ్ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించాలి? ఈ పదానికి సరైన అర్థం ఏమిటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంబ్రిడ్జ్ నిఘంటువు ప్రకారం ప్లేబాయ్ అంటే ఖరీదైన వస్తువులు వినియోగిస్తూ, విలాసవంతమైన జీవనశైలితో, ఆనందకరమైన జీవితం కోసం తన సమయాన్ని, డబ్బును ఖర్చు చేసే ధనవంతుడు అని అర్థం. ఇంతేకాకుండా ఇతర నిఘంటువులలో ఈ పదానికి ... డబ్బు ఉన్న వ్యక్తి విలాసవంతమైన జీవితం గడుపుతూ, శృంగార కలాపాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తాడనే అర్థం ఉంది. అంటే ప్లేబాయ్ అనే పదం విలాసవంతమైన జీవనశైలితో ముడిపడి ఉంటుంది.
పలు నివేదికల ప్రకారం చూస్తే ప్లేబాయ్ మహిళలతో రొమాంటిక్ సంబంధం కలిగి ఉంటాడని, వారి కంపెనీతో ఎక్కువగా గడుపుతారనే వివరణ ఉంది. ప్లేబాయ్ అనేది ఒక ప్రసిద్ధ పత్రిక అనే విషయం తెలిసిందే. ఈ పత్రిక అడల్ట్ కంటెంట్‌ను అందిస్తుంటుంది. ఈ పదాన్ని 18వ శతాబ్దంలో థియేటర్‌లో ప్రదర్శించే యువకులకు ఉపయోగించారు. 1888 నాటి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తుల కోసం ఈ పదం ఉపయోగించారు. 19వ శతాబ్దపు చివరిలో చాలా మంది ఈ పదాన్ని "జూదగాడు" మొదలైన అర్థాల కోసం ఉపయోగించారు. ప్లేబాయ్ అనే పదాన్ని విలాస పురుషుడు అనే పదంతో లింక్ చేయడం సరిపడదని చెప్పవచ్చు. కొన్ని నివేదికలలో మాత్రమే ప్లే బాయ్ అంటే స్త్రీలతో ఆనందించేవాడనే అర్థం ఉంది. కొంతమంది యువతుల విషయంలో ప్లేగర్ల్ అనే పదాన్ని వినియోగిస్తారు. కానీ చాలా నివేదికలలో దీనిని తప్పుగా పరిగణించారు. సాధారణంగా ప్లే గర్ల్ అనే పదాన్ని ప్లేబాయ్‌కి మహిళా ప్రతిరూపానికి ఉపయోగిస్తారు.