పీఈటీ చేసిన నిర్వాకాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది.. ఇటీవల చెల్లెలికి కూడా అలాగే జరగడంతో.. చివరికి..

ABN , First Publish Date - 2022-03-15T21:46:07+05:30 IST

నిర్మానుష్య ప్రదేశాల్లో మహిళలు కనిపిస్తే చాలు.. కామాంధులు తమ శాడిజాన్ని చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం పాఠశాలల్లో కూడా ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్‌లో ఇటీవల..

పీఈటీ చేసిన నిర్వాకాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది.. ఇటీవల చెల్లెలికి కూడా అలాగే జరగడంతో.. చివరికి..
ప్రతీకాత్మక చిత్రం

బాలికలు, యువతులు, మహిళలకు రోజురోజుకూ భద్రత కరువవుతోంది. ఎక్కడ నుంచి ఎవరు ఏవిధంగా దాడి చేస్తారో తెలీని పరిస్థితి నెలకొంది. ఒంటిరిగా బయటికి వెళ్లాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. నిర్మానుష్య ప్రదేశాల్లో మహిళలు కనిపిస్తే చాలు.. కామాంధులు తమ శాడిజాన్ని చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం పాఠశాలల్లో కూడా ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పాఠశాలలో పీఈటీ చేసిన దారుణాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పలేక.. లోలోపలే కుమిలిపోతూ ఉండేది. అయితే ఇటీవల చెల్లెలికి కూడా అలాగే జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


రాజస్థాన్‌ రాష్ట్రం నాగోర్ పట్టణ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు గల ఓ కుటుంబం.. స్థానికంగా నివాసం ఉంటోది. కుమార్తెలు ఇద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇలావుండగా 2018లో పెద్ద కుమార్తె 9వ తరగతి చదువుతున్న సమయంలో బాలికపై పాఠశాలలోని పీఈటీ కన్నేశాడు. ఓ రోజు ఎవరూ లేని సమయంలో.. ఆమెను ఓ గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బయట ఎవరికన్నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం 10వ తరగతి చదువుతున్న సమయంలో మళ్లీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

‘‘మా ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్దాం పదా’’.. అంటూ ప్రియురాలిని తీసుకెళ్లాడు.. వెళ్లిన కొద్ది సేపటి తర్వాత చూస్తే సీన్ రివర్స్..


దీంతో ఆమె భయపడి పాఠశాలకు వెళ్లడమే మానేసింది. ఇంట్లో చెబితే ఏం జరుగుతుందో ఏమో అని భయపడి.. లోలోపలే కుమిలిపోతూ ఉండేది. అయితే ఈ నెల 5వ తేదీన బాధిత బాలిక చెల్లెలిపై కూడా పీఈటీ దారుణానికి ఒడిగట్టాడు. పాఠశాల నుంచి ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలిక.. తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. దీంతో పెద్ద కుమార్తె కూడా గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. తమ కుమార్తెలకు జరిగిన దారుణంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలను విచారించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పాఠశాలలో విచారించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు.

‘‘నాకు తెలీకుండా నువ్వు ఆ పనులు చేయొద్దు’’.. వధూవరుల మధ్య ఇదీ అగ్రిమెంట్.. అసలు విషయం ఏంటంటే..

Updated Date - 2022-03-15T21:46:07+05:30 IST