నీటిలో కొట్టుకువస్తున్న బుట్టను గమనించిన యువకుడు... ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2022-09-04T01:27:19+05:30 IST

కొన్ని అనూహ్య ఘటనలు ఆనందాన్ని కలిగిస్తే.. ఇంకొన్ని విషాదాన్ని మిగుల్చుతుంటాయి. మరికొన్ని ఘటనలు హృదయ విదారకంగా ఉంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటన..

నీటిలో కొట్టుకువస్తున్న బుట్టను గమనించిన యువకుడు... ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్..

కొన్ని అనూహ్య ఘటనలు ఆనందాన్ని కలిగిస్తే.. ఇంకొన్ని విషాదాన్ని మిగుల్చుతుంటాయి. మరికొన్ని ఘటనలు హృదయ విదారకంగా ఉంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటన కూడా.. ఇలాంటి కోవకే చెందుతుంది. ఓ చెరువు నీటిలో కొట్టుకువస్తున్న బుట్టను యువకుడు గమనించాడు. తీరా దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ధార్ పరిధి అమ్‌జేరా నగర్‌ ఖేడపాటి హనుమాన దేవాలయం సమీపంలోని చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం చెరువు వైపు వెళ్తున్న యువకుడు.. నీటిలో ఓ బుట్ట తేలుతూ రావడాన్ని గమనించాడు. దీంతో ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్లాడు. అయితే తీరా అందులో శిశువు మృతదేహం ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఈ వార్త తెలియగానే గ్రామస్తులంతా పెద్ద ఎత్తున అక్కడ గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులను విచారించినా శిశువు గురించిన సమాచారం తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నట్టుండి శిశువు మృతదేహం చెరువులో లభ్యమవడం.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

9 ఏళ్ల క్రితం పెళ్లి.. అప్పటికే ముగ్గురు కూతుళ్లు.. కొడుకు కోసం ఆ తండ్రి ఆశపడితే నాలుగోసారి ఒకే కాన్పులో ముగ్గురు కూతుళ్లు..!
Updated Date - 2022-09-04T01:27:19+05:30 IST