పెళ్లీడుకు వచ్చిన కూతురు ఉంది.. నాకోసం ఇక అప్పులు చేయొద్దంటూ భార్యకు చెప్పి.. ఆస్పత్రిలోనే ఆ రోగి దారుణమిదీ..!

ABN , First Publish Date - 2022-07-05T01:18:14+05:30 IST

పేద కుటుంబానికి చెందిన అతను డయాబెటిక్ రోగి.. కిడ్నీ సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్నాడు..

పెళ్లీడుకు వచ్చిన కూతురు ఉంది.. నాకోసం ఇక అప్పులు చేయొద్దంటూ భార్యకు చెప్పి.. ఆస్పత్రిలోనే ఆ రోగి దారుణమిదీ..!

పేద కుటుంబానికి చెందిన అతను డయాబెటిక్ రోగి.. కిడ్నీ సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్నాడు.. కరోనా తర్వాత పనులు కూడా తగ్గిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు.. చాలా రోజులుగా మంచానికే పరిమితమయ్యాడు.. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అతడిని పదిహేను రోజుల క్రితం హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.. అప్పట్నుంచి అతను హాస్పిటల్‌లోనే ఉన్నాడు.. హాస్పిటల్ బిల్లు పెరిగిపోయి అప్పులపాలైపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.. పెళ్లీడుకు వచ్చిన కూతురు ఉందనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. బీహార్‌లోని మాధేపురాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య ఫిర్యాదు.. కంగారుగా కనిపించడంతో పోలీసులకు డౌట్.. ఆమె ఫోన్‌కాల్ డేటాను చెక్ చేస్తే..


సుపాల్ జిల్లాలోని తుమ్హాకు చెందిన మున్నా చౌదరి (41) అనే వ్యక్తి కొంత కాలంగా మధుమేహంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. పదిహేను రోజుల క్రితం కుటుంబ సభ్యులు అతడిని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. కరోనా కారణంగా ఎలాంటి పనులు చేయకపోవడంతో మున్నా కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఇప్పటికే రూ. 60 వేల అప్పు చేశారు. కుమార్తె పెళ్లి, అప్పుల భారం మొదలైన దాని గురించి ఆలోచించి మున్నా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 


మున్నా ఒక్కగానొక్క కుమారుడు 4 సంవత్సరాల క్రితం స్కూల్‌లో పిల్లలతో గొడవపడి హత్యకు గురయ్యాడని మున్నా సోదరుడు అశోక్ తెలిపాడు. అప్పట్నుంచి మున్నా తీవ్ర విషాదానికి గురై రోగాల పాలయ్యాడు. ఇక, అనారోగ్యం, అప్పులతో విసిగిపోయి హాస్పిటల్‌లోనే శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-05T01:18:14+05:30 IST