పెళ్లీ లేదూ గిల్లీ లేదు.. వ్యభిచారం చేయాల్సిందేనన్న తల్లిదండ్రులు.. వద్దంటున్నా బలవంతంగా.. ఆ గ్రామంలో ఎంతోమంది ఇలాగే..
ABN , First Publish Date - 2022-01-22T22:06:11+05:30 IST
ఇటీవల ఓ యువతి.. యువకుడిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే తల్లిదండ్రలు మాత్రం.. ‘‘పెళ్లీ లేదు గిల్లీ లేదు.. వ్యభిచారం చేయమంటూ బలవంతం చేశారు. ఆ గ్రామంలో అన్ని కుటుంబాల్లో ఇలాగే చేస్తారట..

కూతురికి మంచి సంబంధం చూసి, పెళ్లి చేయాలని తల్లిదండ్రులంతా కోరుకుంటూ ఉంటారు. కూతురు పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే చూడాలని తపిస్తూ ఉంటారు. అత్తగారింట్లో కుమార్తెకు చిన్న ఇబ్బంది కలిగినా తట్టుకోలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో తల్లిదండ్రులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సొంత కూతుళ్లనే వ్యభిచారం చేయమని బలవంతం చేస్తున్నారు. ఇటీవల ఓ యువతి.. యువకుడిని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే తల్లిదండ్రలు మాత్రం.. ‘‘పెళ్లీ లేదు గిల్లీ లేదు.. వ్యభిచారం చేయమంటూ బలవంతం చేశారు. ఆ గ్రామంలో అన్ని కుటుంబాల్లో ఇలాగే చేస్తారట. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం నీముచ్ పరిధి బోరెడ్డి అనే గ్రామానికి చెందిన ఓ యువతికి.. మోయా అనే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇధ్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అయితే ఇందుకు వారు ఒప్పుకోలేదు సరికదా.. పెళ్లీ లేదు ఏం లేదు.. వ్యభిచారం చేసి జీవనం సాగించు అని బదులిచ్చారు. వారి మాటలకు షాక్ అయిన యువతి.. వ్యభిచారం చేసేది లేదని తెగేసి చెప్పింది. దీంతో తల్లిదండ్రులకు కోపం వచ్చి కుమార్తెపై దాడి చేశారు. ఎలాగైనా వ్యభిచారం చేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. అనంతరం కూతురు ప్రేమించిన యువకుడిపై కూడా దాడి చేసి, అతడి ఇంటిని కూడా ధ్వంసం చేశారు.
ఆస్పత్రిలో బయటపడిన 12 పుర్రెలు, 54 ఎముకలు.. డాక్టర్‌ను నిలదీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి..!
కొన్నాళ్లు పోతే తల్లిదండ్రులు తనను అర్థం చేసుకుంటారని ఆశించిన యువతికి నిరాశే ఎదురైంది. రోజురోజుకూ తల్లిదండ్రులతో పాటూ మేనమామ కూడా వ్యభిచారం చేయమని బలవంతం చేయడం మొదలెట్టారు. దీంతో తన బాధనంతా చెప్పుకొంటూ వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తనతో పాటూ తమ గ్రామంలో బాంచా సామాజికవర్గానికి చెందిన చాలా మంది యువతులు ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ఈ వీడియో నీముచ్ ఏఎస్పీ సుందర్ సిన్హ్ కనేర దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాల మేరకు యువతి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ఈ సమస్యపై సమగ్ర దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.