చెట్టుపై పెయింటింగ్.. చూసేందుకు రెండు కళ్లు చాలవు!
ABN , First Publish Date - 2022-07-03T17:26:21+05:30 IST
ట్విట్టర్ ఖాతా @gdalmiathinksలో...
ట్విట్టర్ ఖాతా @gdalmiathinksలో కళాకారుడి అద్భుతమైన కళకు సంబంధించిన వీడియోను చూస్తే మీ కళ్లను మీరు నమ్మలేరు. చెట్టు ట్రంక్‌ను పాలిథిన్ ర్యాప్‌తో చుట్టి, దానిపై పావురం గాలిలో ఎగురుతున్న అద్భుతమైన పెయింటింగ్‌ను చిత్రించారు. 50 వేల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేశారు. భారీ ట్రంక్ ఉన్న చెట్టును చూసిన వెంటనే, అతను దానిని తన కుంచెకు గమ్యస్థానంగా మార్చుకున్నాడు. పెయింటింగ్ పూర్తయ్యేసరికి అద్భుతమైన పావురం కనిపించింది.