Viral Video: తినేటప్పుడు అడిగితే చిర్రెత్తుకొస్తుంది మరి.. ఈ చింపాంజి వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2022-03-19T21:26:30+05:30 IST

చింపాంజీల గురించి అందరికీ తెలిసిందే. మనుషులను మక్కీకి మక్కీ అనుకరించడంలో వీటికి మించిన జంతువు మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. వాటికి ఎలాంటి ట్రైనింగ్ లేకున్నా..

Viral Video: తినేటప్పుడు అడిగితే చిర్రెత్తుకొస్తుంది మరి.. ఈ చింపాంజి వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

చింపాంజీల గురించి అందరికీ తెలిసిందే. మనుషులను మక్కీకి మక్కీ అనుకరించడంలో వీటికి మించిన జంతువు మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. వాటికి ఎలాంటి ట్రైనింగ్ లేకున్నా.. స్వతహాగానే అవి మనుషులను అనుకరిస్తూ ఉంటాయి. అవి చేసే పనుల ద్వారా మనకు ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. తాను తినే సమయంలో మరో చింపాంజి తనకూ కొంత ఇవ్వమని అడగ్గానే.. పెద్ద చింపాంజీకి చిర్రెత్తుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..


తిండి విషయంలో చిన్న పిల్లలు కొట్టుకునే మాదిరిగా ఈ చింపాజీలు ప్రవర్తించిన తీరు.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. ఓ పెద్ద చింపాజీ తన పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకుని ఓ పెద్ద రాయి వద్ద కూర్చుని ఆహారం తింటూ ఉంటుంది. అప్పటికే పక్కన ఇంకో చింపాంజీ కూడా కూర్చుని ఉంటుంది. అయితే దాని ఆహారాన్ని ఖాళీ చేసి, పెద్ద చింపాంజీ వైపు ఆశగా చూస్తూ ఉంటుంది. కొద్ది సేపటి తర్వాత ‘‘ నాకూ కొంచెం ఇవ్వవా..!’’.. అని అడుగుతుంది. దీంతో పెద్ద చింపాంజీకి కోపం వస్తుంది. ‘‘ఎహే.. పక్కకు వెళ్లు’’.. అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ఒక్క తన్ను తన్నుతుంది. దెబ్బకు చిన్న చింపాజీ ఎగిరి పక్కన పడుతుంది. అయితే ఇందులో పెద్ద చింపాజీ అసహ్యించుకునే విధానం.. అచ్చం మనుషుల తరహాలోనే ఉంటుంది. ‘మరాంగోట్’ అనే క్యాప్షన్‌తో IFS అధికారి డా.సామ్రాట్ గౌడ.. ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా నవ్వుకుంటూ.. ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

వావ్! ఈ కుక్క పియానో ఎంత బాగా వాయిస్తుందో.. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..





Read more