-
-
Home » Prathyekam » Nine years after the fathers death the letter reached the daughter is Shaking twitter PVCH-MRGS-Prathyekam
-
తండ్రి చనిపోయిన తొమ్మిదేళ్ల తర్వాత కూతురును చేరిన ఉత్తరం.. ట్విటర్‌ను షేక్ చేస్తోంది..
ABN , First Publish Date - 2022-08-17T20:27:04+05:30 IST
తల్లిదండ్రులకు శాశ్వతంగా వీడ్కోలు పలకాల్సి వస్తే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.

father's letter : తల్లిదండ్రులకు శాశ్వతంగా వీడ్కోలు పలకాల్సి వస్తే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ తరువాత వారి జ్ఞాపకాలు, వారి లేని లోటును పూడ్చాలంటే ఎవ్వరి తరమూ కాదు. ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా ధైర్యం కావాలి. యునైటెడ్ స్టేట్స్(United States)లోని లూయిస్విల్లే విశ్వవిద్యాలయం(University of Louisville)లో అమీ క్లూకీ అనే మహిళ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తొమ్మిదేళ్ల క్రితం తన తండ్రిని కోల్పోయింది. జూలై 27, 2012న తన తండ్రి రాసిన లేఖ ఆమెకు ఇటీవలే దొరికింది.
ఆ లేఖను అందుకున్న వెంటనే దానిని తెరవడానికి క్లూకీ వణికిపోయింది. తేనెటీగల(Honeybee) పెంపకందారుడైన ఆమె తండ్రి తన పిల్లలకు ఆ పెంపకానికి సంబంధించిన పరికరాల గురించి లేఖ రాసినట్టు క్లూకీ పేర్కొంది. "తేనెటీగలు కేవలం తేనె కంటే ఎక్కువ ఉత్పత్తులను తయారు చేస్తాయి. ఒక అభిరుచిగా, ఇది అదనపు ఆదాయానికి మార్గంగా దీన్ని ఎంచుకోవచ్చు. కాబట్టి భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. గుడ్ లక్’’ అని పేర్కొన్నారు. చివరలో ‘లవ్ డాడ్’ అంటూ ముగించారు.
క్లూకీ తన తండ్రి రాసిన లేఖను ట్విట్టర్లో షేర్ చేసింది. "మా నాన్న చనిపోయిన తొమ్మిదేళ్ల తర్వాత ఆయన తేనెటీగల పెంపకం సామగ్రిలో కనుగొనిన లేఖ. ఆయన్ను నేను కోల్పోయాను" అని పోస్ట్ పెట్టింది. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 7.3 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. 41,000 పైగా ఈ లేఖను నెటిజన్లు రీ-ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఎమోషనల్ పోస్ట్‌పై కామెంట్ చేస్తూ తమ ప్రేమను చాటుకున్నారు. కన్నీళ్లతో ఆ లేఖను చదవడం ముగిస్తున్నామని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. మొత్తానికి ఈ లేఖ ట్విటర్‌ను షేక్ చేస్తోంది.