‘‘నాకు తెలీకుండా నువ్వు ఆ పనులు చేయొద్దు’’.. వధూవరుల మధ్య ఇదీ అగ్రిమెంట్.. అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-13T01:13:23+05:30 IST

కరికి తెలీకుండా ఒకరు కొన్ని పనులు చేయొద్దంటూ.. వధూవరులు కలిసి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇదేంటి విచిత్రంగా.. వధూవరులు అగ్రిమెంట్ రాసుకోవడమేంటీ అని అనుకుంటున్నారా. అవును...

‘‘నాకు తెలీకుండా నువ్వు ఆ పనులు చేయొద్దు’’.. వధూవరుల మధ్య ఇదీ అగ్రిమెంట్.. అసలు విషయం ఏంటంటే..

వివాహం అంటే ముందుగా అబ్బాయి, అమ్మాయి కుటుంబాల మధ్య కట్నకానుకల విషయంలో ఒప్పందం, కొన్నిసార్లు అగ్రిమెంట్ రాసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో చివరి నిముషంలో పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిన సందర్భాలు చాలా చూశాం. ఈ విషయం పక్కన పెడితే.. ఓ వివాహ కార్యక్రమంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఒకరికి తెలీకుండా ఒకరు కొన్ని పనులు చేయొద్దంటూ.. వధూవరులు కలిసి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇదేంటి విచిత్రంగా.. వధూవరులు అగ్రిమెంట్ రాసుకోవడమేంటీ అని అనుకుంటున్నారా. అవును వధూవరులు కలిసి కొన్ని విషయాలపై అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం..


వధూవరుల మధ్య అగ్రిమెంట్‌కు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతోంది. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న యువతీయువకులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని పెద్దలకు తెలియజేయడంతో వారు కూడా అంగీకరించారు. అంతా కలిసి ఓ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి వేడుక జరగాల్సిన సమయం కూడా రానే వచ్చింది. బంధువులు, సన్నిహితులంతా మండపానికి చేరుకున్నారు.  తాళి కట్టే ఘట్టం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సమయంలో పెళ్లి పీటలపై ఉండాల్సిన వధూవరులు.. పెళ్లి తర్వాత పాటించాల్సిన నిబంధనలను గుర్తు చేస్తూ అగ్రిమెంట్ రాసుకునే పనిలో పడ్డారు.

వరుడి కోసం మండపంలో వధువు ఎదురుచూపు.. ఆర్భాటంగా రావాల్సిన పెళ్లికొడుకు అంబులెన్స్‌లో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే..


పెళ్లి తర్వాత నుంచి రోజూ కనీసం మూడు సార్లయినా ‘ఐ లవ్ యూ’ అని చెప్పాలి, ఒకరికి తెలీకుండా ఒకరు బోన్‌లెస్ చికెన్ అసలు తినకూడదు, జీవితాంతం ఒకరిపట్ల ఒకరు ఎంతో ప్రేమతో ఉండాలి.. ఇలా రూ.100ల బాండ్ పేపర్‌పై నిబంధనలు రాసుకున్నారు. వాటిని పెద్దల ముందు చదివి వినిపించి, సంతకాలు చేసుకున్నారు. ఇద్దరికీ అగ్రిమెంట్ పేపర్లు అందజేసిన తర్వాత.. వివాహ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ అగ్రిమెంట్ విషయం తెలుసుకున్న బంధువులంతా మొదట అవాక్కయినా.. తర్వాత ఇద్దరినీ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు దీనిపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. దంపతుల మధ్య ఇలాంటి సఖ్యత ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలూ రావంటూ కామెంట్లు పెడుతున్నారు.

‘‘నీకో బహుమతి ఇస్తా, ఊరిబయటకు వచ్చెయ్’’.. అంటూ ప్రియురాలిని పిలిచిన యువకుడు.. మాట్లాడుతూ మాట్లాడుతూ..

Updated Date - 2022-03-13T01:13:23+05:30 IST